Share News

విశాఖలో అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్

ABN , Publish Date - May 13 , 2026 | 03:23 PM

విశాఖలో అక్రమంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ​

విశాఖలో అక్రమ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్
Visakhapatnam Betting Racket

విశాఖపట్నం, మే 13: విశాఖలో అక్రమంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ​నిందితుల నుంచి రూ.2 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఇతర డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ​నిందితుల మొబైల్ డేటా ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దాడి చేసిన విశాఖ పోలీసులు.. ప్రధాన నిందితుడు పఖరాని కరణ్‌తో పాటు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ ముఠా ​గోవాను కేంద్రంగా చేసుకుని ఏపీ, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ నెట్‌వర్క్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అమాయక యువతను ఆకర్షించి, ఫ్రాంచైజీల రూపంలో అక్రమ లావాదేవీలు జరిపినట్లు విచారణలో బయటపడింది. నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వారికి న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ... ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్‌లపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సీపీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటింగ్‌కు చిరునామాగా అమరావతి: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2026 | 04:05 PM