Share News

బధిర యువతిపై అత్యాచారం.. డీఎన్ఏ పరీక్షతో వీడిన గుట్టు

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:20 PM

దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో సభ్యసమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగుచూసింది. కన్న కూతురుపైనే ఓ కీచక తండ్రి అత్యాచారానికి పాల్పడిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బధిర యువతిపై అత్యాచారం.. డీఎన్ఏ పరీక్షతో వీడిన గుట్టు
Mumbai Deaf Woman Case

ఇంటర్నెట్ డెస్క్: ముంబై(Mumbai)కి చెందిన 20 ఏళ్ల బధిర (మూగ, వినికిడి లోపం) యువతి గత ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యానికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, సంచలన విషయం తెలిసింది. వైద్య పరీక్ష(Medical examination)ల్లో ఆ యువతి గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యుల సహకారంలో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


బాధితురాలు బధిరురాలు(deaf woman) కావడంతో ప్రారంభంలో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం కష్టతరమైంది. ఇదే సమయంలో తండ్రిని విచారించగా, తనకు ఏమీ తెలియదని పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అంతేకాదు ఫిర్యాదు చేయడానికి కూడా నిరాకరించాడు. తండ్రి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు, నిపుణుల సాయంతో బాధితురాలికి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ సమయంలో యువతి తనపై జరిగిన దారుణాన్ని వివరించింది.


డీఎన్ఏ పరీక్షతో బయటపడ్డ నిజం..

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఆమె తండ్రి సహా17 మంది అనుమానితుల డీఎన్ఏ(DNA) నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు. తాజాగా వచ్చిన నివేదికల్లో పిండం డీఎన్ఏ, తండ్రి డీఎన్ఏ‌తో మ్యాచ్ అయింది. శాస్త్రీయ ఆధారాలతో నిందితుడు తండ్రేనని తేలడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఓ టీనేజర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణంలో ఇంకా ఎవరి పాత్రైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి..

అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ

Updated Date - Feb 05 , 2026 | 06:32 PM