‘వోట్ చోరీ’ నుంచి ‘క్రెడిట్ చోరీ’ దాకా.. కాంగ్రెస్, CJP మద్దతుదారుల మధ్య సోషల్ మీడియా వార్
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:58 PM
‘వోట్ చోరీ’ ఆరోపణలతో ఈసీకి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఇప్పుడు ‘క్రెడిట్ చోరీ’ దగ్గరికి వచ్చింది. ఉద్యమానికి అసలు ఊపు తెచ్చింది తామేనంటూ కాంగ్రెస్, CJP కార్యకర్తలు విమర్శలు చేసుకుంటున్నారు.
ఎన్నికల సంఘం 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(SIR) విధానానికి వ్యతిరేకంగా 'వోట్ చోరీ' పేరిట ప్రారంభమైన నిరసన ఉద్యమం ఇప్పుడు విపక్షాల మధ్య అంతర్గత వివాదానికి దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేస్తున్న ఈ ఉద్యమానికి నిజమైన నాయకత్వం ఎవరిది? అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ (INC), 'కాకరోచ్ జనతా పార్టీ' (CJP) మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలో 'క్రెడిట్ చోరీ' వార్ నడుస్తోంది. Congress CJP Credit Chori
సీజేపీ దాడి: 'సోషల్ మీడియా లిబరల్స్ ఆక్టివేట్ అయ్యారు'
గాంధీ జయంతి రోజున ముంబైలోని చరిత్రాత్మక శివాజీ పార్క్‌లో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో వేలాది మంది యువత భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన అనూహ్య విజయం సాధించడంతో, CJP సీనియర్ నేత అశుతోష్ రాంకా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్, ఇతర సాంప్రదాయ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
'అభిజీత్ దీప్కే కోట్ల మంది భారతీయ యువత ఆలోచనలను ఆకట్టుకోవడాన్ని తట్టుకోలేక, కొందరు తమను తాము 'లిబరల్స్'గా ప్రకటించుకునే వ్యవస్థ ఆక్టివేట్ అయింది. హాస్యస్పదమైన విషయమేమిటంటే, ఈ వ్యవస్థ కేవలం 'ఎక్స్' కే పరిమితమైంది.. కానీ తామే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని భావిస్తుంటుంది!' అని అశుతోష్ రాంకా (CJP నేత) విమర్శించారు.
సాంప్రదాయ రాజకీయ పార్టీలు కేవలం ప్రెస్ మీట్లు, కోర్టు పిటిషన్లకే పరిమితమయ్యాయని, కానీ సీజేపీ మాత్రమే వీధుల్లోకి వచ్చి నిజమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించిందని CJP కార్యకర్తలు వాదిస్తున్నారు.
ఇలా ఉంటే, CJP విమర్శలపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, యూత్ కాంగ్రెస్ (IYC) నేతలు తీవ్రంగా స్పందించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా CJP నిరసనలను విస్తృతంగా కవర్ చేస్తూ, నిజమైన ప్రతిపక్ష పోరాటాలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ నేత విజయ్ తొట్టతిల్ ఆరోపించారు.
'ముంబై వీధుల్లో కాక్రోచ్‌లు హాయిగా తిరగొచ్చు, కానీ NSUI, IYC కార్యకర్తలు వీధుల్లోకి వస్తే మాత్రం పోలీసులు అరెస్టు చేస్తారు! కాంగ్రెస్‌కు రాని మీడియా కవరేజ్, వీరికే ఎందుకు వస్తోంది? దీని వెనుక ఎవరి ప్లాన్ అమలు జరుగుతోంది?' కాంగ్రెస్ మద్దతుదారులు అంటున్నారు.
ఈ "వోట్ చోరీ" వ్యవహారాన్ని రాహుల్ గాంధీ, ఇండియా (INDIA) కూటమి ఎప్పటినుంచో బయటపెడుతున్నాయని, ఏళ్ల తరబడి తాము చేసిన కష్టాన్ని CJP 'క్రెడిట్ చోరీ' చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీసిటీ బాయిలర్ పేలుడు.. సేఫ్టీ ఆడిట్‌కు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telugu News