Share News

కేరళం సీఎం సస్పెన్స్‌కు రేపటితో తెర.. 14న ప్రమాణస్వీకారం

ABN , Publish Date - May 11 , 2026 | 08:09 PM

కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీలో ఎలాంటి నిరసనలు, రాజకీయ అశాంతికి తావీయరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

కేరళం సీఎం సస్పెన్స్‌కు రేపటితో తెర.. 14న ప్రమాణస్వీకారం
Kerala CM Race

న్యూఢిల్లీ: కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీలో ఎలాంటి నిరసనలు, రాజకీయ అశాంతికి తావీయరాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.


కేరళం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) మాజీ అధ్యక్షులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారంనాడు వరుస సమావేశాలు జరుపనున్నారని, సంప్రదింపుల ప్రక్రియ పూర్తికాగానే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ అంతర్గత వర్గాలు తెలిపాయి.


14న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం పదవికి పోటీపడుతున్న వారిలో కేసీ వేణుగోపాల్ ముందున్నారు. అయితే అధికారికంగా ఇంతవరకూ కాంగ్రెస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. పదవీకాలం ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్, కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వ ప్రమాణస్వీకారం మే 14న ఉంటుందని చెబుతున్నారు.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పదేళ్ల పాలనకు తెరపడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 102 సీట్లతో ఘనవిజయం సాధించింది. ఎల్‌డీఎఫ్ 35 సీట్లకే పరిమితమైంది. కాగా, గత వారంలో కేసీ వేణుగోపాల్, సతీశన్ విధేయుల మధ్య పోస్టర్ల వార్ చోటుచేసుకుంది. తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలంటూ రెండు వర్గాల నేతలు బల ప్రదర్శనలకు దిగారు. కాంగ్రెస్‌లో కీలక భాగస్వామిగా ఉన్న ఐయూఎంఎల్ సైతం సీఎం ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందువల్ల రాజకీయ అస్థిరత చోటుచేసుకునే వీలుందని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

ఎన్నికల ఫలితాలపై పిటిషన్ వేసిన తృణమూల్.. సుప్రీం స్పందన ఏంటంటే..

Updated Date - May 11 , 2026 | 08:15 PM