ఎన్నికల ఫలితాలపై పిటిషన్ వేసిన తృణమూల్.. సుప్రీం స్పందన ఏంటంటే..
ABN , Publish Date - May 11 , 2026 | 07:39 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వల్ల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల తొలగింపులు చేపట్టిన ప్రాంతాల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓడిపోతే దానిపై తిరిగి దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ బాధితులకు ఉందని స్పష్టం చేసింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వల్ల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని తృణమూల్ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల తొలగింపులు చేపట్టిన ప్రాంతాల్లో స్వల్ప తేడాతో పార్టీ ఓడిపోతే దానిపై తిరిగి దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ బాధితులకు ఉందని స్పష్టం చేసింది. అటువంటి స్థానాల్లోని ఓటర్లు లేదా పార్టీలు కొత్త దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ నేతృత్వంలో ధర్మాసనం వెల్లడించింది. అటువంటి కేసులను తాము పరిశీలిస్తామంది (Bengal voter roll deletions).
'సర్'లో తొలగించిన ఓట్ల పునరుద్ధరణ కోసం వేలల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, అవి పరిష్కరించకుండానే ఎన్నికలు జరిగాయని టీఎంసీ పేర్కొంది. వేలల్లో పెండింగ్‌లు ఉన్న 31 అసెంబ్లీ స్థానాల్లో వందల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని వెల్లడించింది. ఒక నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కేవలం 862 ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొంది. ఆ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి 5 వేల మంది పేర్లు తొలగించారని టీఎంసీ ఆరోపించింది (SIR controversy).
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, టీఎంసీకి మధ్య మొత్తం ఓట్ల తేడా 32 లక్షలని (TMC petitions), ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లు 35 లక్షలకు పైగా ఉన్నాయని టీఎంసీ తన పిటిషన్‌లో పేర్కొంది. ఇటువంటి అవకతవకల వల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యయని టీఎంసీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ వార్తనూ చదవండి:
ఇజ్రాయెల్‌కు షాకిచ్చిన హెజ్‌బొల్లా.. ఐరన్ డోమ్ యూనిట్ ధ్వంసం
భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్