Share News

భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

ABN , Publish Date - May 11 , 2026 | 10:10 AM

ఆపరేషన్ సిందూర్ లాంటి దుస్సాహసానికి మరోసారి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ భారత్‌ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.

భారత్‌కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్
Asim Munir

ఇంటర్నెట్ డెస్క్: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బ తట్టుకోలేక పాక్ విలవిల్లాడిపోయింది. చివరకు కాల్పుల విరమణను స్వయంగా ప్రతిపాదించి పెను ముప్పు నుంచి తప్పించుకుంది. ఇవేమీ ప్రపంచానికి తెలియదన్నట్టు ప్రగల్భాలు పలికే పాక్ పాలకులు మరోసారి తమ నోటికి పని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి ప్రగల్భాలకు తెరతీశారు. భారత్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి తెరతీస్తే తీవ్రమైన దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్‌తో గతేడాది జరిగిన ఘర్షణల్లో తామే పైచేయి సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

‘మన శత్రువులు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. వారు మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే మరింత తీవ్రమైన, ప్రమాదకర దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించిన ఆయన ఆ రోజు పాక్ ప్రజలు, సైన్యం గర్వించదగిన రోజు అని వ్యాఖ్యానించారు.


పాక్‌‌ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించేందుకు గతేడాది శత్రువులు ఒక విఫలయత్నం చేశారని అన్నారు. పూర్తి శక్తితో, ఐక్యతతో తాము స్పందించామని గుర్తు చేశారు. ఇరు వర్గాల మధ్య యుద్ధం కేవలం సైనికపరమైనదే కాదని, భావజాలాలకు సంబంధించినదని అన్నారు. ఇలాంటి ఎన్నో ప్రయత్నాల్లో భారత్ విఫలమైందని చరిత్ర రుజువు చేస్తోందని కామెంట్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

విమానం చక్రాల్లో మంటలు.. ల్యాండింగ్ సమయంలో ఘటన.. వైరల్ వీడియో

నాకు అస్సలు నచ్చలేదు.. ఇరాన్ ప్రతిపాదనలకు నో చెప్పిన ట్రంప్!

Updated Date - May 11 , 2026 | 10:26 AM