Share News

వాణిజ్య సిలిండర్‌ ధర రూ.192 తగ్గింపు

ABN , Publish Date - Aug 02 , 2026 | 08:42 AM

హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.192 తగ్గిస్తూ, అలాగే విమానాలకు వాడే ఏటీఎఫ్‌ ధర లీటరుకు రూ. 5 చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి.

వాణిజ్య సిలిండర్‌ ధర రూ.192 తగ్గింపు
Commercial Gas Cylinder

న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.192 తగ్గిస్తూ, అలాగే విమానాలకు వాడే ఏటీఎఫ్‌ ధర లీటరుకు రూ. 5 చొప్పున పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,930 నుంచి 2,738కి తగ్గింది. జూలై ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.183.50కి తగ్గించిన ఆయిల్‌ కంపెనీలు నెల తిరిగేసరికి మరోసారి ధర తగ్గించాయి.


అలాగే మార్కెట్లో లభించే 5 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధర కూడా రూ.808.50 నుంచి రూ.762కి తగ్గింది. కాగా ఇళ్లలో వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు చేయకుండా రూ.942 వద్దే ఉంచాయి. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లోను ఎటువంటి మార్పు చేయలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘క్షమ’ రీల్స్‌కే పరిమితమా...లేక, కేసులు ఉపసంహరిస్తారా?: మోదీకి దీప్కే సూటి ప్రశ్న

పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం

For More National News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 08:48 AM