‘క్షమ’ రీల్స్‌కే పరిమితమా...లేక, కేసులు ఉపసంహరిస్తారా?: మోదీకి దీప్కే సూటి ప్రశ్న
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:18 AM
నిరసనల్లో తనను దూషించిన పిల్లలను క్షమిస్తున్నానన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ‘‘ఫ్రెండ్.. క్షమ కేవలం రీల్స్‌కే పరిమితం అవుతుందా? లేక విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తారా?.’’ అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ/శంభాజీనగర్: నిరసనల్లో తనను దూషించిన పిల్లలను క్షమిస్తున్నానన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ‘‘ఫ్రెండ్.. క్షమ కేవలం రీల్స్‌కే పరిమితం అవుతుందా? లేక విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తారా?.’’ అని ప్రశ్నించారు. దూషించారని ఆరోపిస్తూ విద్యార్థులపై కేసులు నమోదు చేయడానికి ముందు బీజేపీ ఐటీ విభాగంపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళలను, యువతులను బీజేపీ ఐటీ విభాగం సభ్యులు తీవ్రంగా దూషించారని పేర్కొన్నారు. అలానే.. అంతకుముందు మరో సందర్భంలో ‘ఈ దేశ భవిష్యత్తు కంటే కూడా మీ చర్మం నిగనిగలాడుతోంది.’’ అని ప్రధానిని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా, అభిజిత్ దీప్కే అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆయన బాధపడుతున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
నాకు 15 ఏళ్లే.. నన్ను క్షమించండి
విద్యార్థుల ఆందోళనల సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వైరల్ అయిన ఓ బాలిక క్షమాపణలు చెప్పింది. తనను క్షమించాలని చేతులు జోడించి వేడుకుంటూ ఓ వీడియో విడుదల చేసింది. ‘‘ఆందోళన సందర్భంగా కొందరి ప్రభావంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడాను. నా వయస్సు 25ఏళ్లుకాదు..15 ఏళ్లు మాత్రమే. క్షమాపణకు అర్హత లేని విధంగా ప్రవర్తించాను. ఇంకెప్పుడూ ఇలా చేయను’’ అని వేడుకొంది.