9.5 ఏళ్లలో 9.5 లక్షల ఉద్యోగాలిచ్చాం.. యూపీ సీఎం యోగి
ABN , Publish Date - Nov 15 , 2026 | 09:18 PM
రాష్ట్ర యువతకు వచ్చే జనవరి 26లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమ 9.5 సంవత్సరాల పాలనలో యువతకు 9.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర యువతకు వచ్చే జనవరి 26లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తమ 9.5 సంవత్సరాల పాలనలో యువతకు 9.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా స్వామి వివేకానంద యువ సాధికారత పథకం కింద యువతకు 25 లక్షల ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం లక్నోలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన యువతను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. జనవరి 26లోగా ఇక్కడికి వచ్చిన వారి సంఖ్య (55 వేలు) కన్నా రెట్టింపు ఉద్యోగాలు కల్పించి, నియామక పత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో లంచాలు ఇస్తేనే ఉద్యోగాలు
రాష్ట్రంలో గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, రాజకీయ సిఫార్సులు ఉంటేనే కొలువులు దక్కేవని సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి యోగి విమర్శించారు. గతంలో ఉద్యోగ ప్రకటన వెలువడగానే ‘చాచా-భతీజా’ (బాబాయ్ అబ్బాయ్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్) ద్వయం వసూళ్లకు తెరలేపేదని యోగి ఆరోపించారు. లంచాలు, నగదు లావాదేవీలు లేదా రాజకీయ సిఫార్సులు లేకుండా యువతకు ఉద్యోగాలు దక్కేవి కావని విమర్శించారు. తమ ప్రభుత్వంలో నియామక ప్రక్రియలో పారదర్శకత, నిజాయతీకి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూలు, అల్లర్లు లేవని, యువతకు విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గతంలో రాష్ట్ర జనాభాను భారంగా భావించేవారని, కానీ తమ ప్రభుత్వం 25 కోట్ల జనాభాను భారంగా కాకుండా ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశానికి గొప్ప జనాభా వనరుగా గుర్తించిందని పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం