Share News

అలా చేస్తే అధికారంలోకి రారు.. రాహుల్‌కు అమిత్ షా చురక

ABN , Publish Date - Nov 15 , 2026 | 07:50 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసి అధికారంలోకి రాలేరని హితవు పలికారు.

అలా చేస్తే అధికారంలోకి రారు.. రాహుల్‌కు అమిత్ షా చురక
Amit Shah Criticizes Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి విమర్శలు గుప్పించారు. తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసి అధికారంలోకి రాలేరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం విమర్శించే ప్రయత్నం చేస్తుంటారని విమర్శించారు. ఇది ఎన్నటికీ ఆయనకు ఉపయోగకరం కాదని చెప్పారు.

‘మీరు అధికారంలోకి రావాలనుకుంటే ముందుగా విదేశీ పర్యటనలను కట్టిపెట్టాలి. గ్రామాల్లో పర్యటించాలి. అప్పుడైతే ఏదో ఒక రోజు పరిస్థితులు అనుకూలంగా మారతాయి. కానీ మీరు నా మాట వినరని తెలుసు. కాబట్టి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పేదేంటంటే రాహుల్ గాంధీని మీరు ఇదే తీరులో కొనసాగనిస్తే మరో 30 ఏళ్ల వరకూ మీకు అవకాశం ఉండదు’ అని అన్నారు. పుణెలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్‌లో భారత్‌ సమ్మిట్ కార్యక్రమంలో ఇటలీ రాజకీయ నాయకుడు వోట్ చోరీ ప్రస్తావన తేవడాన్ని హోం మంత్రి అమిత్ షా ఆక్షేపించారు. వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కాంగ్రెస్ ఈ విధంగా తన ఓటమి వెళ్లగక్కుతోందని అన్నారు. అందుకే దేశంలోని లెఫ్టిస్టు వాదులతో పాటు విదేశీ వామపక్షవాదులను కూడా కాంగ్రెస్ ఆహ్వానించిందని చెప్పారు. కార్యక్రమానికి భారత్ సమ్మిట్ అని పేరు ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం అంతర్జాతీయ వేదికల్లో జాతి వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడిస్తుంటారని విమర్శంచారు.

‘మీకు పదేళ్ల అధికారం దక్కింది. కానీ 12 లక్షల కోట్ల రూపాయల స్కామ్‌లు, అవినీతికి పాల్పడ్డారు. అందుకే ప్రజలు ప్రజలు మిమ్మల్ని అధికార పీఠం నుంచి చేయిపట్టి లాగేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు’ అని మంత్రి అమిత్ షా చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

బ్రేకులు పనిచేయని వందే భారత్ 463 కిలోమీటర్ల ప్రయాణం..

వ్యవసాయ వ్యర్థాలపై అభ్యంతరం.. యూట్యూబర్ కుటుంబంపై మూకదాడి

Updated Date - Nov 15 , 2026 | 08:11 PM