Share News

జేడీయూలో చేరిన నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్

ABN , Publish Date - Mar 08 , 2026 | 03:49 PM

బిహార్‌ జనతాదళ్ యునైటెడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నాయకత్వంలో జనరేషన్ మార్పునకు సంకేతంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారుడు తనయుడు నిశాంత్ కుమార్ లాంఛనంగా జేడీయూలో ఆదివారంనాడు చేరారు.

జేడీయూలో చేరిన నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్
Nishant kumar joins JDU

పాట్నా: బిహార్‌ జనతాదళ్ యునైటెడ్ (JDU)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ నాయకత్వంలో జనరేషన్ మార్పునకు సంకేతంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ (Nishant Kumar) లాంఛనంగా జేడీయూలో ఆదివారంనాడు చేరారు. పార్టీ ప్రముఖులు, కేంద్ర నేతలు, కార్యకర్తల సమక్షంలో పాట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీలో చేరారు. 40 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన నిశాంత్‌కు కేంద్ర మంత్రి రాజీవ్ సిన్హా లలన్, జేడీయూ వర్కింగ్ ప్రెసిండెంట్ సంజయ్ ఝా తదితరులు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. నితీశ్ కుమార్ ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.


పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: నిశాంత్

జేడీయూలో లాంఛనంగా చేరిన అనంతరం నిశాంత్ మాట్లాడుతూ, తన తండ్రి రాజ్యసభకు వెళ్లాలనుకోవడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని, దానిని అంతా గౌరవించాలని అన్నారు. ఆయన గైడెన్స్‌లోనే పనిచేస్తామని, పార్టీ పటిష్టతకు తాను కృషి చేస్తానని చెప్పారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన తన తండ్రి ఇరవై ఏళ్లలో రాష్ట్రానికి ఎంతో చేశారని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధికి నితీశ్ చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు.


కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా..

కాగా, నితీశ్ కుమార్ రాజీనామా అనంతరం కొత్త ప్రభుత్వంలో నిశాంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు నితీష్ సన్నిహితుడు ఒకరు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

వంటింట్లోకి వార్‌

కమల్‌ స్టైల్లో అమిత్‌.. రజనీలా మోదీ

Updated Date - Mar 08 , 2026 | 03:53 PM