కమల్ స్టైల్లో అమిత్.. రజనీలా మోదీ
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:41 AM
తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు పలురకాలుగా ప్రయత్నిస్తున్నాయి. తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ కలసి సుమారు...
చెన్నై, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి పార్టీలు పలురకాలుగా ప్రయత్నిస్తున్నాయి. తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ కలసి సుమారు 45 ఏళ్ల తర్వాత ఓ సినిమా చేస్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రానికి ‘కేహెచ్/ఆర్‌కే’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. అందులో రజనీకాంత్, కమల్ హాసన్ స్టైల్‌కు సినిమా అభిమానుల్లో అద్భుత స్పందన వచ్చింది. దీంతో ఆ స్టార్ల అభిమానులను ఆకట్టుకోవడానికి తమిళనాడు బీజేపీ ప్రయత్నించింది. సినిమా ప్రోమోలో రజనీ, కమల్ కనిపించినట్లు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫొటోలను ఏఐలో రూపొందించింది. దీనికి పోటీగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కూడా ‘ది పవర్ కాంబో’ పేరుతో రాహుల్ గాంధీ-ఎంకే స్టాలిన్ ఫోటోలను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ