ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ
ABN , Publish Date - Mar 06 , 2026 | 08:19 PM
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తరువాత ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌ను ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో ఎలాంటి డీల్ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు. ఇరాన్ బేషరుతుగా లొంగిపోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో తాజాగా పోస్టు పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం మొదలై నేటికి 7వ రోజు కావడంతో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఇరాన్ లొంగిపోయిన అనంతరం దేశాన్ని ముందుకు నడిపించే నాయకత్వ ఎంపిక ఉంటుందని అన్నారు. ఆ తరువాత ఇతర మిత్రదేశాలతో కలిసి తాము ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. ఇరాన్‌కు అద్భుత భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు (Iran's Unconditional Surrender).
ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధంపై ఐరోపా దేశాల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ యుద్ధానికి యస్ చెప్పేది లేదని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంఛెజ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఒక అసాధారణ తప్పిదమని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై దాడులకు వీలుగా స్పెయిన్ దక్షిణ భాగంలో సైనిక స్థావరాలను కలిసి నిర్వహిద్దామన్న ట్రంప్ ఆఫర్‌ను కూడా ప్రధాని శాంఛెజ్ తిరస్కరించారు.
ఇక యుద్ధం ఇలాగే మరో రెండు మూడు వారాల పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని ఖతర్ ఇంధన శాఖ మంత్రి తాజాగా హెచ్చరించారు. బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలూ చదవండి:
ఈ క్షిపణితోనే ఖమేనీపై మెరుపు దాడి!
ఖతర్ మంత్రి హెచ్చరిక! యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే..