E20 పెట్రోల్ పాలసీపై పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టత..
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:48 PM
దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించే E20 పెట్రోల్ పాలసీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చింది. E20 ఇంధన వినియోగం, పాత వాహనాల భద్రత, చేకూరే ప్రయోజనాలను వివరించింది.
ఢిల్లీ, ఆగస్టు 4: దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ఉపయోగించే E20 పెట్రోల్ పాలసీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక స్పష్టత ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. E20 ఇంధన వినియోగం, పాత వాహనాల భద్రత, దీని వల్ల చేకూరే ప్రయోజనాలను కేంద్రం సమగ్రంగా వివరించింది.
E20 ఇంధన పాలసీ లక్ష్యాలు
దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగాన్ని దశలవారీగా వేగవంతం చేస్తున్నామని, ఈ పాలసీ ద్వారా ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం దీని ప్రధాన లక్ష్యమని చెప్పింది. చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు అదనపు మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా రైతులకు మెరుగైన మద్దతు ధర, అదనపు ఆదాయం అందుతుందని వెల్లడించింది. ఇంధనంలో ఇథనాల్ కలపడం వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గి, పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
కిడ్నాప్ కేసు.. గుజరాత్‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్
Read Latest AP News And Telugu News