Share News

CBFC పోర్టల్‌లో భారీ డేటా లీక్? 500కి పైగా సినిమాల రహస్య పత్రాలు బహిర్గతం!

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:14 PM

కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు CBFCకి చెందిన 'ఈ సినిప్రమాణ్' పోర్టల్‌లో డేటా లీక్ అంశం సంచలనంగా మారింది. 500కి పైగా సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు, వ్యాపార ఒప్పందాల పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

CBFC పోర్టల్‌లో భారీ డేటా లీక్? 500కి పైగా సినిమాల రహస్య పత్రాలు బహిర్గతం!
CBFC e Cinepramaan Data Leak

ఢిల్లీ, అక్టోబర్ 25: కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు (CBFC)కి చెందిన డిజిటల్ పోర్టల్ 'ఈ-సినిప్రమాణ్' (e-Cinepramaan)లో భారీ డేటా లీక్ సంచలనం రేపుతోంది. ఫలితంగా దాదాపు 500కి పైగా సినిమాలకు సంబంధించిన సున్నితమైన, అత్యంత రహస్యమైన పత్రాలు ఇంటర్నెట్‌లో బహిర్గతమయ్యాయన్న వార్తలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ పోర్టళ్లలో భద్రపరిచే రహస్య సమాచార భద్రతపై ఈ సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.(CBFC e Cinepramaan Data Leak)


సినిమాలు సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సమర్పించిన షూటింగ్ స్క్రిప్ట్‌లు, సెన్సార్ బోర్డు జారీ చేసిన కట్ ఆర్డర్లు, వివిధ వ్యాపార ఒప్పందాల పత్రాలు ఈ లీక్‌లో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల సినీ పరిశ్రమలోని ఆర్థిక లావాదేవీలు, భవిష్యత్ వ్యాపార చర్చలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.

ఇదిలాఉంటే, కొత్తగా తెరకెక్కించిన ఏ సినిమా అయినా థియేటర్లలో ప్రదర్శించాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి కావడంతో, పూర్తి కథ, సీన్స్ వివరాలతో కూడిన స్క్రిప్టులను బోర్డుకు అందించాల్సి వస్తుంది. పదేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘ఈ-సినీప్రమాణ్’ పోర్టల్ ద్వారా నిర్మాతలు ఆయా పత్రాలను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ పోర్టల్‌లో భద్రతా లోపం తలెత్తి, నిర్మాతలు పంపిన స్క్రిప్టులు, బోర్డు సూచించిన కట్స్, అధికారిక పత్రాలన్నీ ‘ఇంటర్నెట్ ఆర్కైవ్’ అనే డిజిటల్ లైబ్రరీలో ఈ ఫైళ్లన్నీ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునేలా కనిపించాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై CBFC స్పందిస్తూ తక్షణమే సమగ్ర విచారణతో పాటు పోర్టల్ సెక్కూరిటీ ఆడిట్ ప్రారంభించినట్లు తెలిపింది. అనధికారికంగా డేటా యాక్సెస్ జరిగినట్లు వచ్చిన నివేదికలను పరిశీలించామని, ఎలాంటి లీకేజీ జరగలేదని బోర్డు పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 06:44 PM