కాంగ్రెస్ ఆఫీసులో మోదీపై పొగడ్తల వర్షం!
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:33 AM
చెన్నైలోని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో ఏర్పాటైన సదస్సులో బ్రిటన్ డిప్యూటీ రాయబారి సుట్పా చౌదరి ప్రధాని మోదీపై ..
చెన్నై, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): చెన్నైలోని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో ఏర్పాటైన సదస్సులో బ్రిటన్ డిప్యూటీ రాయబారి సుట్పా చౌదరి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడంతో సభలో పాల్గొన్న ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి సహా పార్టీ నేతలు అవాక్కయ్యారు. సత్యమూర్తి భవన్‌లో శనివారం అఖిలభారత వృత్తినిపుణుల కాంగ్రెస్ తమిళనాడు శాఖ వార్షిక సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సుట్పా చౌదరి మాట్లాడుతూ..గత జూలైలో మోదీ లండన్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకమని, భారతదేశాన్ని ప్రగతిపథంలో పయనింపజేస్తుందని ఆమె అదే పనిగా అభినందించారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక