Bomb Threat: ఉత్తరప్రదేశ్‌లోని కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:58 PM
ఇటీవల కాలంలో పలు రైళ్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాశీ ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో తీవ్ర కలకలం రేగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని మవూ(Mau) రైల్వే స్టేషన్ వద్ద కాశీ ఎక్స్‌ప్రెస్ (Kashi Express ) 15018 రైలుకు బాంబులు పెట్టామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాశీ ఎక్స్‌ప్రెస్ రైలును మవూ రైల్వే స్టేషన్ (Mau railway station) వద్ద నిలిపివేశారు. స్థానిక పోలీసులు, ఆర్పీఎఫ్(RPF), జీఆర్పీ(GRP) బృందాలు రంగంలోకి దిగారు. రైలులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి.. బాంబ్ స్క్వాడ్(Bomb Squad) సహాయంతో ప్రతి కోచ్‌నూ క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఒకటో ఫ్లాట్ ఫారమ్‌ను పూర్తిగా ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అయితే.. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, బాంబులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఎవరో కావాలని చేసిన ఫేక్ మెసేజ్ అని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం రైలు ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇటీవల కొంతమంది ఆకతాయిలు ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు, బెదిరింపు కాల్స్ చేస్తూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..
స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి