డంపర్‌లో వీరజవాన్ల మృతదేహాలు.. ప్రజల తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Nov 14 , 2026 | 09:19 PM
జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్‌వర్‌లో ఇటీవలే జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీవోలు) బాబీ చంద్, రష్‌పాల్ కుమార్ భౌతికకాయాలను డంపర్‌లో తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. శవపేటికలు లేకుండా, కనీస గౌరవం కూడా పాటించకుండా మృతదేహాలను తీసుకురావడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్‌వర్‌లో ఇటీవలే జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీవోలు) బాబీ చంద్, రష్‌పాల్ కుమార్ భౌతికకాయాలను డంపర్‌లో తరలించడం తీవ్ర వివాదానికి దారితీసింది. శవపేటికలు లేకుండా, కనీస గౌరవం కూడా పాటించకుండా మృతదేహాలను తీసుకురావడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో కిష్ట్‌వర్ జిల్లాలోని కియార్ గ్రామానికి వారి భౌతికకాయాలను డంపర్‌లో తీసుకురావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల మృతదేహాలను కనీస గౌరవం లేకుండా తరలించడంపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను మోసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. చివరకు ఆర్మీ నుంచి స్ట్రెచర్ తెచ్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మృతదేహాలను కప్పేందుకు తెల్లటి వస్త్రాన్ని కూడా తామే సమకూర్చుకున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉన్నతాధికారులు ఎవరూ రాలేదని ఆరోపించారు.
ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సునీల్ శర్మ, కిష్ట్‌వర్ ఎమ్మెల్యే షగున్ పరిహార్ తీవ్రంగా మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులపై ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని వారు ప్రశ్నించారు. మృతదేహాలను డంపర్‌లో తీసుకురావడం తమ ఎస్పీఓలకు జరిగిన అవమానమని షగున్ పరిహార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అక్కడికి ఆలస్యంగా చేరుకున్న పోలీసు ఉన్నతాధికారిని ఆమె నిలదీశారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని షగున్ తెలిపారు. తర్వాత బాబీ చంద్, రష్‌పాల్ కుమార్ భౌతిక కాయాలకు పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..