Share News

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

ABN , Publish Date - May 31 , 2026 | 02:39 PM

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన మండి (15 వార్డులు), పాలంపూర్ (15 వార్డులు), సోలాన్ (17 వార్డుల), ధర్మశాల (17 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను ప్రకటించారు.

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
BJP sweeps in Himachal Pradesh

సిమ్లా: కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన మండి (15 వార్డులు), పాలంపూర్ (15 వార్డులు), సోలాన్ (17 వార్డుల), ధర్మశాల (17 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను ప్రకటించారు. వీటిలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ (BJP) విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఒక మున్సిపల్ కార్పొరేషన్‌ను దక్కించుకుంది. మండి, ధర్మశాల, సోలన్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ విజయం సాధించగా, పాలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ గెలిచింది.


ఈవీఎంలు, పార్టీ గుర్తులతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మే 17న జరిగాయి. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో రికార్డు స్థాయిలో 63.44 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రా జిల్లా ధర్మశాల, పాలంపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో 63.72 శాతం పోలింగ్, మండిలో 68.78 శాతం, సోలాన్‌లో 58.32 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో మే 26, 28, 30 తేదీల్లో జరిగాయి. ఈ ఎన్నికలను పార్టీ గుర్తుల మీద కాకుండా బ్యాలెట్ పేపర్లతో నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు, తుపాను వాతావరణం ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో 81 శాతం ఓటింగ్ నమోదైంది.


ఇవి కూడా చదవండి..

భారత అథ్లెటిక్స్‌కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్‌'లో ప్రధాని ప్రశంసలు

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘటన.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి..

Updated Date - May 31 , 2026 | 03:14 PM