Share News

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘటన.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి..

ABN , Publish Date - May 31 , 2026 | 01:07 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. చందితల పోలీస్ స్టేషన్ బయట ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో మరో ఘటన.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి..
Kalyan Banerjee injured

కోల్‌కతా, మే 31: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. చందితల పోలీస్ స్టేషన్ బయట ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పోలీసులు అరెస్ట్ చేసిన టీఎంసీ పార్టీ నాయకులు, కార్యకర్తలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీ కల్యాణ్ బెనర్జీ, కొంతమంది పార్టీ కార్యకర్తలు హుగ్లీ జిల్లాలోని చందితల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులకు మెమొరాండమ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు కల్యాణ్ బెనర్జీపై దాడి చేశారు. ఆయన తలకు గాయం అయింది. గొడవ మరింత పెరుగుతుండటంతో పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను అదుపు చేశారు. తలకు అయిన గాయానికి కల్యాణ్ హ్యాండ్ కర్చీఫ్ కట్టుకున్నారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. కావాలనే తమను టార్గెట్ చేసి దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా తమ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి

గర్ల్స్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మీ కోసం!

టమాటా బజ్జీ.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..

Updated Date - May 31 , 2026 | 01:21 PM