ఎన్డీయేలో చేరిన ట్వంటీ20 పార్టీ.. ప్రధాని కేరళ పర్యటనకు ముందు కీలక పరిణామం
ABN , Publish Date - Jan 22 , 2026 | 09:17 PM
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కేరళలో బీజేపీకి మరింత బలం చేకూరే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్వంటీ20 పార్టీ లాంఛనంగా ఎన్డీయే కూటమిలో చేరింది.
తిరువనంతపురం: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కేరళలో బీజేపీకి మరింత బలం చేకూరే కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్వంటీ20 (Twenty20) పార్టీ లాంఛనంగా ఎన్డీయే కూటమిలో గురువారంనాడు చేరింది. బీజేపీ కేరళ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్‌ను ట్వంటీ20 చీఫ్ సాబూ ఎం జాకబ్ (Sabu M Jacob) కలుసుకుని ఎన్డీయేకు తమ పార్టీ మద్దతును ప్రకటించారు.
సాబూ ట్వంటీ20 పార్టీతో పొత్తును చంద్రశేఖర్ స్వాగతించారు. ఎన్డీయే విజన్‌కూ, సాబూ విజన్‌కు చాలా దగ్గర సామీప్యం ఉందని, సాబూ చేరికతో అభివృద్ధి చెందిన కేరళ నిర్మాణం దిశగా చేస్తున్న తమ ప్రయత్నాలకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. అభివృద్ధి, ప్రగతి, నిజమైన ప్రజాసేవకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ/ఎన్డీయే కట్టుబడి ఉన్నాయని, తమ అభివృద్ధి సిద్ధాంతాలను విశ్వసించే ప్రతి ఒక్కరూ తమకు సహజ భాగస్వాములేనని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో చంద్రశేఖర్ పేర్కొన్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా, ఉపాధి సృష్టికర్తగా, రాజకీయ నేతగా సాబూను తాను ఎంతగానో అభిమానిస్తానని చెప్పారు. 'వికసిత కేరళం' విజన్ ఇప్పుడు కేరళ అంతటా ప్రతిధ్వనిస్తోందనడానికి ఎన్డీయేలో సాబూ చేరికే నిదర్శనమని అన్నారు. కాగా, రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం మేయర్ పోస్టును బీజేపీ సొంతం చేసుకోవడం ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.
23న కేరళలో పర్యటించనున్న మోదీ
షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 23వ తేదీ శుక్రవారంనాడు కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా తిరువనంతపురంలో పలు కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. బహిరంగ సభలోనూ పాల్గొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఎస్ఐఆర్ వెతలతో కవితా సంపుటి.. మమతా బెనర్జీ
ముంబై మేయర్ పదవి మహిళకే.. లాటరీ ప్రక్రియపై ఉద్ధవ్ శివసేన అభ్యంతరం
Read Latest National News