Share News

వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు.. ప్రధాని మోదీ బర్త్‌డేకు బీజేపీ భారీ ప్లాన్..

ABN , Publish Date - Sep 01 , 2026 | 07:54 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు 30 రోజుల యాత్ర చేపట్టనుంది. ఈ యాత్రలో పది బృందాలు పాల్గొంటాయి.

వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు.. ప్రధాని మోదీ బర్త్‌డేకు బీజేపీ భారీ ప్లాన్..
PM Modi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు 30 రోజుల యాత్ర చేపట్టనుంది. ఈ యాత్రలో పది బృందాలు పాల్గొంటాయి. ఈ యాత్ర మోదీ జన్మదినం రోజైన సెప్టెంబర్ 17న ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనుంది (BJP nationwide outreach yatra).


ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్, ఆయన లోక్‌సభ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలను అనుసంధానిస్తూ ఈ యాత్ర నిర్వహించనున్నారు. వాద్‌నగర్, వారణాసి నుంచి ఒకేసారి మొత్తం 10 బృందాలు బయలుదేరనున్నాయి. వారణాసి నుంచి బయలుదేరే బృందాలు వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణించి నెల రోజుల్లో వాద్‌నగర్ చేరుకుంటాయి. అలాగే వాద్‌నగర్ నుంచి బయలుదేరే బృందాలు వివిధ ప్రాంతాల మీదుగా ప్రయాణించి వారణాసికి చేరుకుంటాయి (Vadnagar to Varanasi Yatra).


ప్రతి బృందం రోజుకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి బృందంలో 10 మందికి పైగా బైకర్లు ఉండనున్నారు. అలాగే ఇతర కార్యకర్తలు బస్సుల్లో ప్రయాణించనున్నారు. ఇలా బైక్‌లు, బస్సుల్లో పట్టణాలు, గ్రామాలు, జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణిస్తూ స్థానిక ప్రజలతో బీజేపీ కార్యకర్తలు మమేకం కానున్నారు. రోజుకు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం నిర్ణీత ప్రాంతాల్లో బృందాలు బస చేస్తాయి.


బస చేసిన ప్రాంతంలో స్థానిక కార్యకర్తలతో సమావేశాలు, ప్రజా సంబంధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు (Narendra Modi birthday 2026). అలాగే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ యాత్రను కేవలం ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమంగా కాకుండా బీజేపీ సంస్థాగత బలాన్ని మరింత పెంచే కార్యక్రమంగా కూడా పార్టీ చూస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగనుంది.


ఇవి కూడా చదవండి..

ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ కోర్టు భారీ ఊరట.. ఇక ఏకాంత నిర్బంధం ఉండదు..


విజయ్ ఫర్ పీఎం.. టీవీకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు ముదురుతున్నాయా..

Updated Date - Sep 01 , 2026 | 07:54 PM