నితిన్ నబిన్ ఆధ్వర్యంలో కొత్త టీమ్‌కు కసరత్తు
ABN , Publish Date - Jun 26 , 2026 | 10:39 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సరికొత్త టీమ్ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నితిన్ నాబిన్ కొత్త టీంకు రంగం సిద్ధం అవుతోంది.
న్యూఢిల్లీ, జూన్ 26: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సరికొత్త టీమ్ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నితిన్ నాబిన్ కొత్త టీంకు రంగం సిద్ధం అవుతోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మోదీ కేబినెట్‌లోని పలువురు సహాయ మంత్రులతో నితిన్ నబిన్ సమావేశమయ్యారు. అలాగే ఈ రోజు (శుక్రవారం), శనివారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు.
ఉత్తరప్రదేశ్ మోడల్ రిపీట్ అవుతుందంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీ తరహాలోనే జాతీయ స్థాయిలోనూ యువత, కొత్త వారికి పెద్దపీట వేయాలనే తలంపులో బీజేపీ అధిష్ఠానం ఉందనే చర్చ సాగుతోంది. విపక్షాల ‘పీడీఏ’ (PDA) వ్యూహానికి చెక్ పెట్టేలా ఓబీసీ, దళిత, మహిళలతోపాటు యువతకు ఈ కొత్త టీమ్‌లోకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే విధంగా మోదీ కేబినెట్‌లోని పలువురు కేంద్ర మంత్రులను ఆయా పదవుల నుంచి తప్పించి.. వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సైతం సాగుతోంది.
మరో వైపు టీఎంసీ నుంచి 20 మంది, శివసేన (యూబీటీ) నుంచి ఆరు మంది ఎంపీలు ఎన్డీయే కూటమిలోకి వెళ్లారు. ఈ తిరుగుబాటు ఎంపీల పార్టీ మార్పుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తర్వాత ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది సమాచారం. ఇంకో వైపు కేబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ జూన్ నెలాఖరు నాటికి కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందనే చర్చ తీవ్రంగా సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐబీ చీఫ్‌గా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.. కేంద్రం ఆదేశాలు
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
For More National News And Telugu News