Share News

అబోహర్‌లో బీజేపీ విజయకేతనం.. తొలిసారి మేయర్‌ పదవి కైవసం

ABN , Publish Date - May 29 , 2026 | 07:30 PM

పంజాబ్‌లోని అబోహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించింది. 50 వార్డుల్లో 28 వార్డులు సొంతం చేసుకుంది.

అబోహర్‌లో బీజేపీ విజయకేతనం.. తొలిసారి మేయర్‌ పదవి కైవసం
BJP

ఛండీగఢ్: పంజాబ్‌ (Punjab)లోని అబోహర్ (Abohar) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలుపు సాధించింది. 50 వార్డుల్లో 28 వార్డులు సొంతం చేసుకుంది. దీంతో అబోహర్‌లో బీజేపీ తొలిసారి మేయర్ పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. 2027లో కీలకమైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఈ గెలుపు బీజేపీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.


అబోహర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను శుక్రవారంనాడు ప్రకటించారు. బీజేపీ 28 వార్డులు గెలుచుకోగా, ఆప్ 20 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఒక స్థానం, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానం గెలుచుకున్నారు.


'కాలిఫోర్నియా ఆఫ్ పంజాబ్'గా అబోహర్‌ను పిలుస్తారు. కిన్నో పండ్ల సాగు, బలమైన వ్యవసాయ ఆదాయం కలిగిన ప్రాంతమిది. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన అర్బన్ సెంటర్లలో ఇదొకటి. ఈ ప్రాంతంలో ఓటర్ల మనోభావాలను తాజా ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, 2027 ఎన్నికలకు ముందు ఇలాంటి ఫలితం వెలువడంతో ఆసక్తికరమని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలోని 8 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్ కౌన్సిళ్లు, 20 నగర పంచాయతీలకు మే 26న ఎన్నికలు జరిగాయి. మోహాలి, బటిండా, అబోహర్, బర్నాలా, కపుర్తాలా, మోగా, బటాలా, పఠాన్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో 7.555 మంది పోటీ చేశారు. ఆప్, కాంగ్రెస్, బీజేపీ, సాద్‌తో పాటు బహుజన్ సమాజ్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఆయన ఎన్నో సార్లు డిప్రెషన్‌కు గురయ్యారు.. డీకే జ్యోతిష్యుడు

జూన్ 1న డీకే ప్రమాణస్వీకారం.. సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం!

Updated Date - May 29 , 2026 | 07:57 PM