Share News

బిహార్‌కు కేంద్ర పరిశీలకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:36 PM

బిహార్‌ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బీజేపీ అధిష్ఠానం ఆదివారంనాడు నియమించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

బిహార్‌కు కేంద్ర పరిశీలకుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్
Shivraj Singh Chouhan

న్యూఢిల్లీ: బిహార్‌ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపికను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivaraj Singh Chouhan)ను బీజేపీ అధిష్ఠానం ఆదివారంనాడు నియమించింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్త లెజిస్లేటివ్ పార్టీ నేత ఎన్నిక కీలకం కానుంది.


బీహార్ లెజిస్లేటివ్ పార్టీ నేత ఎన్నికను పర్యవేక్షించేందుకు పరిశీలకునిగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పార్టీ పార్లమెంటరీ బోర్డు నియమించినట్టు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.


14న బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం

బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ ఈనెల 14న సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక జరుగుతుంది. ఏప్రిల్ 13 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని జేడీయూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ తెలిపారు. నితీశ్ కుమార్ ఈనెల 10న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బీహార్ ప్రభుత్వ పగ్గాలను బీజేపీ చేపట్టనుంది.


సామ్రాట్ చౌదరికే అవకాశాలు

కాగా, బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది. కొయెరి సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరికి ఓబీసీ వర్గాల్లో మంచి పేరుంది. 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఏడాది తర్వాత ఉపముఖ్యమంత్రి అయ్యారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు మోదీ లేఖ

ఎన్నికల వేళ ఎందుకీ తొందర... మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీకి ఖర్గే ఘాటు లేఖ

Updated Date - Apr 12 , 2026 | 04:39 PM