Share News

చికెన్ షవర్మా తిని 43 మందికి అస్వస్థత.. బాధితుల్లో గర్భిణీ, చిన్నారులు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 09:16 PM

ఇంటర్నెట్ డెస్క్: మ‌హ‌రాష్ట్ర‌లోని భివండీ ప్రాంతంలో చికెన్‌ షవర్మా తిని 43 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 17 మంది పురుషులు, 16 మంది మ‌హిళ‌లు, 10 మంది చిన్నారులు ఉన్నారు.

చికెన్ షవర్మా తిని 43 మందికి అస్వస్థత.. బాధితుల్లో గర్భిణీ, చిన్నారులు!
Bhiwandi Food Poisoning

ఇంటర్నెట్ డెస్క్: మ‌హ‌రాష్ట్ర‌లోని భివండీ ప్రాంతంలో చికెన్‌ షవర్మా తిని 43 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 17 మంది పురుషులు, 16 మంది మ‌హిళ‌లు, 10 మంది చిన్నారులు ఉన్నారు. అలానే ఓ గర్భిణీ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. న‌గ‌రంలోని వంజార్‌పట్టి నాకా ప్రాంతంలో ఉన్న ఓ షాపులో సోమవారం రాత్రి షవర్మా తిన్నవారిలో కొంద‌రికి మంగళవారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు అయ్యాయి.


బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బాధితులను చికిత్స కోసం ఇందిరాగాంధీ స్మతి ఉపజిల్లా ఆస్పత్రిలో చేర్చారు. షవర్మా తినడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆ తరువాత కాసేపటికి ప‌లువురు బాధితులు ఇదే లక్షణాలతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరడంతో అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.


దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. మరోవైపు ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన‌ షవర్మా దుకాణాన్ని కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేశారు. కాగా, ఈ ఏడాది జూన్‌ 15న భివండిలోని ఖండుపాడా ప్రాంతంలో చికెన్‌ షవర్మా తిని ఏకంగా 107 మంది ఫుడ్‌ పాయిజనింగ్‌ బారినపడ్డారు. తాజాగా మరోసారి ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటన చోటుచేసుకోవడంతో కార్పొరేషన్‌ అధికారుల పర్యవేక్షణ, ఆహార భద్రత చర్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

పుణెలో విద్యార్థులపైకి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురి పరిస్థితి విషమం!

కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తు.. అమేథీ, రాయ్‌బరేలీతో అసలు సమస్య..

Updated Date - Nov 25 , 2026 | 09:16 PM