Share News

కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తు.. అమేథీ, రాయ్‌బరేలీతో అసలు సమస్య..

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:31 PM

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న ఈ రెండు పార్టీలు సీట్ల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి.

కాంగ్రెస్‌-ఎస్పీ పొత్తు.. అమేథీ, రాయ్‌బరేలీతో అసలు సమస్య..
Akhilesh Yadav, Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న ఈ రెండు పార్టీలు సీట్ల విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఇప్పటికే సహరాన్‌పూర్ నియోజకవర్గాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇక అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలు ఈ పొత్తకు మరో పెద్ద సమస్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి (Congress Samajwadi Party Alliance).


అమేథీ, రాయ్‌బరేలీ ప్రాంతాల్లోని మొత్తం పది అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ కన్నేసింది. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు గాంధీ కుటుంబానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం పది అసెంబ్లీ స్థానాలనూ తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలవలేదు (Congress SP Seat Sharing).


అమేథీలోని నాలుగు స్థానాల్లో రెండింటిని, రాయ్‌బరేలీలోని ఆరు స్థానాల్లో నాలుగింటిని ఎస్పీ గెలుచుకుంది. మిగిలిన నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అందుకే గత ఎన్నికల్లో తాము గెలిచిన స్థానాలను కాంగ్రెస్‌కు కేటాయించడానికి ఎస్పీ నాయకత్వం వెనుకాడుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్, అఖిలేష్ యాదవ్ నేరుగా చర్చలు జరిపే అవకాశం కనబడుతోంది (INDIA Alliance).


కాగా, ఇప్పటికే సహరాన్‌పూర్ అసెంబ్లీ స్థానం గురించి వివాదం మొదలైంది (UP Assembly Elections 2027). యూపీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ ఇమ్రాన్ మసూద్ సహరాన్‌పూర్ స్థానాన్ని ఆశించారు. అయితే పొత్తు చర్చలు కొనసాగుతుండగానే ఎస్పీ తన ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో సహరాన్‌పూర్ ప్రాంతంలోని స్థానాలు కూడా ఉండటంతో కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. తమను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..


తిరుపరంకుండ్రం కొండపై దీపం వివాదం.. వందేళ్ల క్రితం అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 25 , 2026 | 06:33 PM