ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:35 PM
ఉత్తరాఖండ్ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. మంచుతో కప్పుకున్న హిమాలయ పర్వతాలు, పచ్చని లోయలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. మంచుతో కప్పుకున్న హిమాలయ పర్వతాలు, పచ్చని లోయలు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఎప్పుడూ ఆకర్షిస్తుంటాయి. అలాంటి రమణీయ ప్రాంతానికి కార్తీక పౌర్ణమి నాటి చంద్రుడు మరింత అందాలు అద్దాడు. చుట్టూ విస్తరించిన పర్వత శ్రేణుల మధ్య జరిగిన చంద్రోదయం చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది (Uttarakhand Moonrise).
mr_pahadi_15 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో.. హిమాలయ పర్వత శ్రేణిలోని పంచచూలి శిఖరాల వెనుక నుంచి చంద్రుడు నెమ్మదిగా ఉదయించడం కనిపిస్తోంది. 'మీరు సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి ఉంటారు. కానీ ఇలాంటి చంద్రోదయాన్ని మాత్రం ఎప్పుడూ చూసి ఉండరని నేను పందెం కాయగలను' అని ఆ వ్యక్తి కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు (Moonrise Viral Video).
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు (Stunning Moonrise). ఇలాంటి ప్రకృతి దృశ్యాలను ప్రత్యక్షంగా చూడాలంటే అదృష్టం ఉండాలని చాలా మంది కామెంట్లు చేశారు. ఈ దృశ్యాలను చూస్తుంటే పర్వత ప్రాంతాలకు వెళ్లాలనిపిస్తోందని మరికొందరు వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు
ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు