హిందీ నేర్చుకోవాలని ఉద్యోగులకు బెదిరింపు.. సారీ చెప్పిన బెంగళూరు జొమాటో సూపర్‌వైజర్
ABN , Publish Date - Oct 06 , 2026 | 10:28 AM
హిందీ నేర్చుకుంటేనే ఉద్యోగంలో కొనసాగుతారని, లేకపోతే వెళ్లిపోవాలని ఉద్యోగులను బెదిరించిన జొమాటో గిడ్డంగి సూపర్‌వైజర్‌పై బెంగళూరులో కన్నడ భాషాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హిందీ నేర్చుకుంటేనే ఉద్యోగంలో కొనసాగుతారని, లేకపోతే వెళ్లిపోవాలని ఉద్యోగులను బెదిరించిన జొమాటో గిడ్డంగి సూపర్‌వైజర్‌పై బెంగళూరులో కన్నడ భాషాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి చెందిన అశోక్ అనే వ్యక్తి బెంగళూరులోని జొమాటో గిడ్డంగిలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి ఉద్యోగులకు హిందీ నేర్చుకోవాలని లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని బెదిరించాడు. అతను ఒక ఉద్యోగితో అలా మాట్లాడుతుండగా ఎవరో వ్యక్తి వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘నాకు కన్నడ రాదు. నేను మీతో కన్నడలో మాట్లాడలేను. హిందీలో మాత్రమే మాట్లాడగలను. మీరు కూడా హిందీ నేర్చుకోండి. లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, ఇది కర్ణాటక అని ఎవరో బదులు చెప్పగా.. అయితే ఏంటి? నేను హిందీలోనే మాట్లాడుతాను’’ అని అశోక్ అన్నట్లుగా ఆ వీడియోలో రికార్డయింది.
మండిపడ్డ కన్నడిగులు..
ఆ వీడియో బయటకు రావడంతో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అశోక్‌పై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కన్నడ భాషను అశోక్ అవమానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కన్నడ భాష సంఘాలకు చెందిన పలువురు కార్యకర్తలు జొమాటో గిడ్డంగి ముందు ఆందోళన చేశారు. అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆ టైంలో పోలీసులు అశోక్‌ను తమ స్వాధీనంలోకి తీసుకుని కార్యకర్తలను శాంతపరిచారు. తర్వాత అతడిని విడుదల చేశారు. ఈ ఘటన అనంతరం అశోక్ కన్నడలో మాట్లాడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. తాను చేసింది తప్పని, ఇంకోసారి ఆ తప్పు చేయనని ఆ వీడియోలో అతను పేర్కొ్న్నాడు. తన తప్పుకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
3 రాష్ట్రాలు, ఒక యూటీలో 6 స్థానాలకు నేడు బైపోల్స్
వాళ్ల దగ్గర భారీగా అణ్వాయుధాలున్నాయి..
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..