Share News

నిమ్మరసానికి గ్యాస్ బిల్లు వేశారు.. ఎంతో తెలుసా..!

ABN , Publish Date - Mar 17 , 2026 | 10:12 AM

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి టీ గానీ, టిఫిన్, భోజనం గానీ తింటే ఆ హోటల్ వాళ్లు బిల్లు ఇస్తారు. ఆ బిల్లుపై ఎంత అమౌంట్ వేశారు.. అందులో సీజీఎస్టీ ఎంత, ఎస్‌జీఎస్టీ ఎంత, సర్వీస్ ఛార్జీ ఎంత, ఇతర అనవసర బిల్లులు ఏమైనా వేశారా..

నిమ్మరసానికి గ్యాస్ బిల్లు వేశారు.. ఎంతో తెలుసా..!

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లి టీ గానీ, టిఫిన్, భోజనం గానీ తింటే ఆ హోటల్ వాళ్లు బిల్లు ఇస్తారు. ఆ బిల్లుపై ఎంత అమౌంట్ వేశారు.. అందులో సీజీఎస్టీ ఎంత, ఎస్‌జీఎస్టీ ఎంత, సర్వీస్ ఛార్జీ ఎంత, ఇతర అనవసర బిల్లులు ఏమైనా వేశారా అని వివరాలు చూస్తాం. ఆ తరువాతే బిల్లు చెల్లిస్తాం. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే చూశాడు. తనకు వచ్చిన బిల్లు చూసి ఖంగుతిన్నాడు. అవును మరి.. ఆ బిల్లులో ఎవరూ ఊహించని రీతిలో కొత్త అంశాన్ని జోడించారు.


ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా ఎల్పీజీ కొరత విపరీతంగా ఉంది. మన దేశంలోనూ ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా వరకు రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్ కొరత కారణంగా తినే ఆహారాలకు రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ క్రైసిస్ పేరు పెట్టి ప్రత్యేకంగా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వంటకాల రేట్లు పెంచడంలో తప్పేం లేదులే అని మనం భావిస్తాం. కానీ, కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు మాత్రం ఇదే ఛాన్స్‌గా అందినకాడికి దోచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతలా అంటే.. నిమ్మరసానికి కూడా గ్యాస్ క్రైసిస్ బిల్లు వసూలు చేసే పరిస్థితికి వచ్చేశారు. అవును, మీరు చదివేది నిజంగా నిజం. ఈ ఘటన బెంగళూరులోని ఓ హోటల్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన బిల్లు స్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కొందరు వ్యక్తులు బెంగళూరులోని ఓ కేఫ్‌కి వెళ్లారు. అక్కడ వారు రెండు పుదీనా నిమ్మకాయ జ్యూస్‌లు తాగారు. ఆ తరువాత వెయిటర్ ఇచ్చిన బిల్లు చూసి వినియోగదారులు షాక్ అయ్యారు. రెండు జ్యూస్‌ల ధర రూ.358 వేసిన కేఫ్ నిర్వాహకులు.. అందులో సిలిండర్ క్రైసిస్ బిల్లు వేయడం షాక్‌కు గురిచేసింది. గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ పేరిట 5 శాతం(17.01) బిల్లు వేశారు. నిమ్మకాయ రసానికి గ్యాస్ బిల్లు ఏంటని ఆశ్చర్యపోయిన వినియోగదారులు.. ఆ బిల్లును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అవుతోంది. కేఫ్ నిర్వాహకుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. గ్యాస్ క్రైసిస్‌ను ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ బిల్లు వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ వ్యవహారంపై కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల హక్కుల కమిషన్‌ స్పందించింది. నిమ్మరసానికి గ్యాస్ క్రైసిస్ ఛార్జ్ వసూలు చేసిన కేఫ్‌కి నోటీసులు జారీ చేశారు.


Also Read:

ఐపీఎల్ 2026: నడవలేని స్థితిలో హర్షిత్ రాణా.. చాలా మ్యాచ్‌లకు దూరం!

కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి మరీ..

నేను ఏమైనా చేయగలను! క్యూబాపై ట్రంప్ సంచలన వ్యాఖ్య

Updated Date - Mar 17 , 2026 | 11:24 AM