పుష్ప బాధ్యత నాది... ఫాల్టా రీపోలింగ్ వేళ సీఎం సువేందు వార్నింగ్
ABN , Publish Date - May 16 , 2026 | 08:33 PM
తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్‌కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టి హెచ్చరిక చేశారు. ఆయనను 'పేరుమోసిన క్రిమినల్'గా అభివరిస్తూ, ఖాన్‌కు చెందిన కేసులను తాను వ్యక్తిగతంగా హ్యాండిల్ చేస్తానని అన్నారు.
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్‌కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) గట్టి హెచ్చరిక చేశారు. ఆయనను 'పేరుమోసిన క్రిమినల్'గా అభివరిస్తూ, ఖాన్‌కు చెందిన కేసులను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని అన్నారు. మే 21న రీపోలింగ్ జరుగనున్న ఫాల్టా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా జహంగీర్ ఖాన్ పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శునివారంనాడు ఫాల్టాలో జరిగిన బహిరంగ ర్యాలీలో సువేందు పాల్గొన్నారు.
'ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరగాలని మేము అనుకుంటున్నాం. ఎలాంటి ఘటనలకు తావుండరాదని భావిస్తున్నాం. ప్రజాస్వామ్య విలువలను మన ప్రధానమంత్రి బలంగా నమ్ముతారు. బీజేపీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎన్నికల అనంతర హింసపై మాకు నమ్మకం లేదు. 'పుష్ప'గా చెప్పుకుంటున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ పేరుమోసిన నేరస్థుడు (జహంగీర్ ఖాన్) ఎక్కడ? ఆయన మాకు ఎక్కడా కనిపించలేదు. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక్కడ ఎలాంటి హింసకు తావు లేదు. నవ్వెక్కడున్నావు పుష్పా?' అని సువేందు అధికారి ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29న ఫాల్టాలో పోలింగ్ నిర్వహించారు. అయితే ఓటర్లను బెదిరించడం, ఈవీఎంల ట్యాంపరింగ్ సహా పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో మే 21న రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కంచుకోటగా పేరున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఫాల్టా ఉంది. ఇక్కడ జరగనున్న రీపోలింగ్‌లో బీజేపీ అభ్యర్థిగా దేబాన్షు పాండా పోటీ చేస్తున్నారు. దేబాన్షు పాండాను లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను సువేందు అధికారి కోరారు. మే 24న ఫాల్టా రీపోలింగ్ ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
రూలర్స్ లా నుంచి రూల్ ఆఫ్ లా తెచ్చాం... సువేందు అధికారి
ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై రాహుల్ డిమాండ్