రూలర్స్ లా నుంచి రూల్ ఆఫ్ లా తెచ్చాం... సువేందు అధికారి
ABN , Publish Date - May 16 , 2026 | 06:48 PM
పశ్చిమబెంగాల్‌ను పాలకుల ఇష్టానుసారం పాలించే వారని, ఇప్పుడు ఆ స్థానే చట్టబద్ధ పాలనను రాష్ట్రంలో తీసుసు వచ్చామని ముఖ్యమంత్రి సువేందు అధికారి అన్నారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal)ను గత పాలకుల ఇష్టానుసారం పాలించే వారని (Rulers Law), ఇప్పుడు ఆ స్థానే చట్టబద్ధ పాలనను(Rule of Law) రాష్ట్రంలో తీసుసు వచ్చామని ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) అన్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్‌లో తొలిసారి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మీటింగ్‌లో శనివారంనాడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సంక్షేమ బోర్డును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పోలీసు సంక్షేమ బోర్డు ఒక రాజకీయ పార్టీకి 'బ్రాంచ్ ఆర్గనైజేషన్'గా మారినందునే దీనిని రద్దు చేస్తున్నామని తెలిపారు.
'ఒక మంచి ఉద్దేశంతో పోలీసు సంక్షేమ బోర్డు ఏర్పాటయింది. అయితే చివరికి అది పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయింది. అది పోలీసు సంక్షేమానికి ఉపయోగపడిందా లేదా అనేది నాకు తెలియదు. కానీ, అక్రమపద్ధతిలో ఉద్యోగాల ఎక్స్‌టెన్స్‌కు మార్గంగా మారింది. కొందరు వ్యక్తిగతంగా లబ్ధిపొందారు. అందుకే ఆ బోర్డును ఇవాళ రద్దుచేస్తున్నాం' అని సువేందు చెప్పారు. పోలీసు సంస్కరణలకు అవసరమైన కొత్త విధివిధానాలను మూడు నెలల్లో రూపొందించేందుకు చీఫ్ సెక్రటరీ సారథ్యంలో అత్తున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
పోలీసులు వేధింపులకు పాల్పడితే సాధారణ పౌరుడు సైతం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని, చట్టం అందరికీ సమానమని సువేందు అన్నారు. ఈ-రిక్షాలు, అటోరిక్షా డ్రైవర్లు, హాకర్ల నుంచి ఒక వర్గం పోలీసులు కానీ, స్థానిక గ్రూపులు కానీ డబ్బులు వసూలు చేస్తుంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సుంకాల పేరుతో సొమ్ములు వసూలు చేయడం కానీ, రోడ్లపై వాహనాలు నిలిపివేయడం కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్న పోలీసు అధికారులపై దాడులు జరిగితే సహించేది లేదని, ఇందుకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ఎవరు పాల్పడినా వారి వ్యక్తిగత సేవింగ్స్‌ను నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
బొద్దింకల వ్యాఖ్యలపై వివరణ.. యువతను విమర్శించలేదన్న సీజేఐ
సీఎం విజయ్, మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ ప్రకటన..