Share News

మోదీ మాటల నుంచి స్ఫూర్తి పొందవచ్చు : బెల్జియం ప్రధాని

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:25 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన నేతల్లో ప్రధాని మోదీ ఒకరని పేర్కొన్నారు. మోదీవి హేతుబద్దమైన ఆలోచనలు అని కీర్తించారు.

మోదీ మాటల నుంచి స్ఫూర్తి పొందవచ్చు : బెల్జియం ప్రధాని
PM Modi With Belgian Prime Minister Bart De Wever

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 05: భారత ప్రధాని నరేంద్ర మోదీపై బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన నేతల్లో ప్రధాని మోదీ ఒకరని పేర్కొన్నారు. మోదీవి హేతుబద్దమైన ఆలోచనలు అని కీర్తించారు. ఆయన చెప్పిన వాటిని మనం అనుసరించాలని పేర్కొన్నారు. మోదీ వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ప్రధాని మోదీ.. తెలివైన నాయకుడని ఆభివర్ణించారు. శనివారం దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా భారత్ - యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి.


ఈ సందర్భంగా బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ మాట్లాడుతూ.. భారత్‌లో పర్యటించడం గౌరవంగా ఉందన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో తాను సమావేశమయ్యానని పేర్కొన్నారు. ఆయనతో భేటీ కావడం గౌరవంగా ఉందన్నారు. గతంలో కోవిడ్ కారణంగా తన భారత పర్యటన రద్దయిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.


ప్రపంచంలోని పలువురు నాయకులు బెదిరింపు ధోరణిలో మాట్లాడతారని అన్నారు. కానీ భారత ప్రధాని మోదీ మాటలు.. స్ఫూర్తితోపాటు మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని చెప్పారు. నరేంద్ర మోదీ మాటలను అనుసరించాలనిపిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ ఎండగట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్క్రీన్ టైమ్‌ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..

ఆ ఆటోకు 50 లక్షల వ్యూస్.. కారణం ఇదే.. వీడియో వైరల్

For More National News And Telugu News

Updated Date - Sep 05 , 2026 | 12:11 PM