Share News

స్క్రీన్ టైమ్‌ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..

ABN , Publish Date - Sep 05 , 2026 | 10:43 AM

ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖీ నిర్వహించారు. ముఖాముఖీ సందర్భంగా పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారటంపై ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు.

స్క్రీన్ టైమ్‌ తగ్గేలా చూడటం అవసరం.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన..
PM Modi Screen Time

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖీ నిర్వహించారు. ముఖాముఖీ సందర్భంగా పిల్లలు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారటంపై ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘స్క్రీన్ టైమ్ ఓ వ్యసనంలా మారింది. నాకో ఆలోచన వచ్చింది. మైదానంలో ఆడే ఆటలపై పిల్లలకు ఆసక్తి పెరిగేలా చేస్తే స్క్రీన్ అడిక్షన్ నుంచి వారు బయటపడే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా ముఖ్యం’ అని అన్నారు.


ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘కొన్ని ప్రధాన నగరాల్లోని విశ్వవిద్యాలయాలలో డ్రెస్ కోడ్ వివాదానికి సంబంధించి, చాలావరకు అవగాహన లోపం కనిపిస్తోంది. కొన్నిసార్లు ఎటువంటి వివరణ ఇవ్వకుండానే విద్యార్థులపై నిబంధనలను రుద్దుతున్నారు. ఉపాధ్యాయులు డ్రెస్ కోడ్ చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి. ఇటువంటి చర్యల కారణంగా పిల్లల ప్రవర్తనలో ఏవైనా మార్పులు వస్తున్నాయా అని గమనించాలి. పిల్లల జీవితాలతో మమేకం కావడానికి మనం పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లను దాటి ముందుకు రావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

లాటరీలో గెలవగానే ఇల్లు వచ్చినట్లు కాదు!

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి..

Updated Date - Sep 05 , 2026 | 11:28 AM