Share News

అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఐదుగురు అదుపులోకి

ABN , Publish Date - Aug 03 , 2026 | 01:03 PM

అస్సాంలోని హైలాకండి జిల్లాలో 15 ఏళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఐదుగురు అదుపులోకి
Hailakandi Crime News

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని హైలాకండి జిల్లా కాత్లిచెరా పోలీస్‌ స్టేషన్ పరిధిలోని అలోయిచోరా ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగిన విందుకు వెళ్లిన బాలిక.. కజిన్‌తో వాగ్వాదం తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చినట్లు సమాచారం. అనంతరం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా ఆమె మృతదేహం పడిఉండటాన్ని గుర్తించారు. హత్యకు ముందు బాలికపై లైంగిక దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించగా, ఘటన తీరు అత్యంత దారుణంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని అధికారులు వెల్లడించారు.


ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్ఎస్పీ అమితాబ్ సిన్హా తెలిపారు. కుటుంబ సభ్యులు లైంగిక దాడి జరిగిందని ఆరోపిస్తున్నప్పటికీ.. వైద్య పరీక్షలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 01:19 PM