లోక్‌సభ స్పీకర్‌పై రాహుల్ ఆరోపణలకు అమిత్ షా కౌంటర్
ABN , Publish Date - Mar 11 , 2026 | 07:18 PM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.
ఢిల్లీ, మార్చి 11: లోక్‌సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికార బీజేపీ నేతలు.. కాంగ్రెస్ సభ్యుల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదంటూ కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఆరోపణలు అవాస్తమని హోం మంత్రి అమిత్ షా అన్నారు.
అమిత్ షా మాట్లాడుతూ..' స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఎవరైతే విమర్శలు చేస్తున్నారో.. ఆ నేత.. పార్లమెంట్ సమావేశాల హాజరు విషయంలో వెనుకున్నారు. సమస్యల గురించి ప్రస్తావించేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చినప్పటికీ సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు పారిపోతున్నారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఎప్పుడూ ఫిర్యాదులు చేసే రాహుల్ గాంధీకి(Rahul Gandhi) నేను ఒక సూటీ ప్రశ్న అడుగుతున్నాను. మాట్లాడటం ఎవరు డిసైడ్ చేస్తారు?. స్పీకరా?. కాదు కదా.. మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి. కానీ, మీరు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు జర్మనీ, ఇంగ్లండ్ లో ఉంటారు' అని అమిత్ షా అన్నారు.
'ఈ 18వ లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలకు157 గంటలు 55 నిమిషాలు మాట్లాడారు. అయితే ప్రతిపక్షనేత ఎంత మాట్లాడాడు? ఆయన ఎందుకు మాట్లాడలేదు?. ఏ స్పీకర్ అతడిని ఆపారు?. రాహుల్ గాంధీని మాట్లాడకుండా ఎవరు ఆపలేదు. ఆ గ్యాప్ ను ఆయన స్వయంగా సృష్టించుకున్నారు' అంటూ అమిత్ షా తెలిపారు. హోం మంత్రి వ్యాఖ్యలతో లోక్‌సభ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఇది కూడా చదవండి:
స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి
స్పీకర్ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం