కొత్త లుక్‌లో అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:10 PM
సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చినప్పుడు న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇటీవల కొత్త లుక్(New Look)లో కనిపించారు. సహజంగా ఆయన పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు తన తండ్రి దివంగత నేత ములాయం సింగ్ యాదవ్‌ను తలపిస్తూ తెల్లటి కుర్తా, పైజమా, నల్లటి జాకెట్, ఎర్రటి టోపీతో కనిపిస్తుంటారు. అయితే ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని భారత్‌కు వచ్చిన అఖిలేష్ యాదవ్ న్యూఢిల్లీ విమానాశ్రయంలో కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగురంగు టీ-షర్ట్, నల్లటి జీన్స్, పొడవాటి జుట్టుతో ఆయన కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విమానాశ్రయంలో అఖిలేష్‌ను చూడగానే పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అఖిలేష్ కూడా వారితో సెల్ఫీలు దిగుతూ సందడిగా కనిపించారు. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ సిబ్బందితోనూ అఖిలేష్ కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో అఖిలేష్ న్యూ లుక్స్‌పై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'ధురంధర్' లుక్స్‌లో కనిపిస్తున్నారని కొందరు, బిగ్ బాస్ స్టైల్‌లో ఉన్నారని కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్
లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ