అజిత్ పవార్ చివరి ఫోటో ఇదే
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:54 PM
విమాన ప్రమాద ఘటనకు ముందు అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బందితో దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగుచూసింది. బుధవారం ఉదయమే అజిత్ ఈ ఫోటో దిగారని పార్టీ నాయకులు ధ్రువీకరించారు.
ముంబై: బారామతిలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణించడం మహారాష్ట్రను విషాదంలో ముంచింది. విమాన ప్రమాద ఘటనకు ముందు అజిత్ పవార్ తన సెక్యూరిటీ సిబ్బందితో దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగుచూసింది. బుధవారం ఉదయమే అజిత్ ఈ ఫోటో దిగారని పార్టీ నాయకులు ధ్రువీకరించారు. ఇదే ఆయన చివరి ఫోటోగా చెబుతున్నారు.
అజిత్ పవార్ ఉదయం 8 గంటలకు ప్రైవేటు విమానంలో బయలుదేరారు. సుమారు 45 నిమిషాలకు బారామతీ విమానాయశ్రయం సమీపంలో ల్యాండ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. పవార్‌తో పాటు విమానంలోని మరో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సుదీర్ఘకాలం పనిచేసిన డీసీఎంగా..
మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన క్రెడిట్ అజిత్ పవార్ (66)కు దక్కుతుంది. పలు ప్రభుత్వాల్లో ఆయన ఆరు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పృధ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవిస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాల్లో పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, బడుగు వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన చాంపియన్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కీలక విషయాలను వెల్లడించిన DGCA
విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్ వీడియో..
For More National News And Telugu News