నాన్నా డిప్యూటీ సీఎంతో వెళ్తున్నా.. విమానం అటెండెంట్ చివరి మాటలివే
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:14 PM
విమాన అటెండెంట్‌గా పింకీ మాలీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్‌తో ఫోనులో మాట్లాడారు.
ముంబై: బారామతిలో బుధవారంనాడు జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు మరణించిన మరో నలుగురిలో పింకీ మాలి (Pinky Mali) ఉన్నారు. విమాన అటెండెంట్‌గా ఆమె అజిత్ పవార్‌తో పాటు విమానంలో వెళ్లారు. దీనికి ఒకరోజు ముందే పింకీ మాలి తన తండ్రి శివకుమార్‌తో ఫోనులో మాట్లాడారు. 'నాన్నా డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నాను' అని చెప్పారు. అయితే విమాన ప్రమాద దుర్ఘటనలో పింకీ కన్నుమూయడం ఆమె కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. తనతో మాట్లాడిన మాటలే తన కుమార్తె చివరి మాటలు అవుతాయని అనుకోలేదంటూ శివకుమార్ కన్నీరుమున్నీరయ్యారు. ఇక ఎప్పటికీ రాదంటూ భావోద్వేగానికి గురయ్యారు.

'నిన్న అమ్మాయి నాకు ఫోన్ చేసింది. అజిత్ పవార్‌తో కలిసి బారామతి వెళ్తున్నాను. అక్కడి నుంచి నాందేడు వెళ్లాలి. హోటల్‌కు చేరుకోగానే ఫోన్ చేస్తాను' అని పింకీ చెప్పినట్టు శివకుమార్ గుర్తుచేసుకున్నారు. అయితే బుధవారం ఉదయమే తమ కలల సౌధాలన్నీ కుప్పకూలిపోయాయని, టీవీలో విమాన ప్రమాదం వార్త చూడగానే తన నవనాడులూ కుంగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల్లో తన కుమార్తె కూడా ఉందని తెలిసి చిగురుటాకులా వణికిపోయాయని కన్నీరు మున్నీరయ్యడు.
విమానం అటెండెంట్‌గా పింకీ మాలి తన బాధ్యతల్లో భాగంగా అజిత్ పవార్‌తో తరచు వెళ్లేవారు. గత ఐదేళ్లుగా విమానం అటెండెంట్‌గా పింకీ పని చేస్తోందని, తొలుత ఎయిరిండియాలో పనిచేసి ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలో చేరిందని శివకుమార్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తనకు తెలియదని, తన కుమార్తె మృతదేహాన్ని అప్పగించగానే గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కీలక విషయాలను వెల్లడించిన DGCA
For More National News And Telugu News