Share News

విమాన ఛార్జీలకు రెక్కలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:28 PM

చెన్నై నగరం నుంచి ఇతర నగరాలకు వెళుతున్న విమాన ఛార్జీ లు రెండున్నర రెట్లు పెరిగాయి. శాసనసభ ఎన్నికలు గురువారం ఒకేవిడతలో జరుగుతున్నాయి.

విమాన ఛార్జీలకు రెక్కలు
Chennai flight ticket prices

చెన్నై: చెన్నై నగరం నుంచి ఇతర నగరాలకు వెళుతున్న విమాన ఛార్జీ లు రెండున్నర రెట్లు పెరిగాయి. శాసనసభ ఎన్నికలు గురువారం ఒకేవిడతలో జరుగుతున్నాయి. నగరంలో పనిచేస్తున్న వారు, తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు బయల్దేరారు. సమయపాలన రీత్యా ఆర్ధిక స్థోమత ఉన్న వారు విమానాల్లో వెళ్తున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో విమాన సంస్థలు ఛార్జీలు ఒక్కసారిగా పెంచేశాయి.


nani2.2.jpgఆ ప్రకారం, నగరం నుంచి మదురైకు రూ.4,000 -రూ.5,000 వరకు వసూలుచేస్తుండగా, ప్రస్తుతం రూ.14,000 పెరిగింది. అలాగే, తూత్తుకుడికి సాధారణ రోజుల్లో రూ.5,000 ఛార్జీ వసూలు చేస్తుండగా, ప్రస్తుతం రూ.17,000 పెరిగింది. అలాగే, పలు నగరాలకు నడిపే విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరోగమనంలో పసిడి ధరలు

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై తల్లిదండ్రుల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2026 | 12:28 PM