పురుషులకు కూడా ఉచిత బస్సు పథకం.. అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
ABN , Publish Date - Mar 24 , 2026 | 09:07 PM
కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని, పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
చెన్నై: కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని, పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని అన్నాడీఎంకే (AIADMK) ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto) హామీ ఇచ్చింది. డీఎంకే హయాంలో నిత్యావసరాల ధరలు పెరుగుదల, పన్నుల భారంతో ప్రజలు సతమతమవుతున్నందున ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున ప్రత్యేక సాయం అందిస్తామని భరోసా ఇచ్చింది. మొత్తం 297 హామీలును ఈ మేనిఫెస్టోలో అన్నాడీఎంకే పొందుపరిచింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (Edappadi K Palaniswami) మంగళవారంనాడు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
'కుల విళక్కు స్కీమ్' కింద రేషన్ కార్డులున్న కుటుంబాల్లోని మహిళా పెద్దకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఇది నేరుగా వారి అకౌంట్లలో జమ చేస్తామని ఈపీఎస్ వాగ్దానం చేసారు. రేషన్ కార్డు హోల్డర్లకు పప్పులు, బియ్యంతో పాటు రిఫ్రిజిటేర్ అందజేస్తామని అన్నాడీంకే మేనిఫెస్టో హామీ ఇచ్చింది. పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని తెలిపింది. రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఏటా మూడు ఉచిత వంటగ్యాసు సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.
ఏఐడీఎంకే సారథ్యంలో ఎన్డీయే కూటమి ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తోంది. సీట్ల పంపకాల్లో భాగంగా అన్నాడీఎంకే 170కి పైగా సీట్లలో పోటీ చేయనుండగా, భాగస్వామ్య పక్షమైన బీజేపీకి 27 సీట్లు కేటాయించింది. పీఎంకే 18, ఏఎంఎంకే 11 సీట్లలో పోటీ చేయనున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 23న జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ప్రధానమంత్రి మోదీకి ట్రంప్ ఫోన్
కోవిడ్ విషాదాలను మోదీ మరచిపోయారా... రాహుల్ గాంధీ