Share News

ప్రధానమంత్రి మోదీకి ట్రంప్ ఫోన్

ABN , Publish Date - Mar 24 , 2026 | 07:26 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారంనాడు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారు.

ప్రధానమంత్రి మోదీకి ట్రంప్ ఫోన్
Trump speaks PM Modi

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మంగళవారంనాడు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, హోర్ముజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వెల్లడించారు.


'అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడారు. హోర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరంతో పాటు పశ్చిమాసియాలో పరిస్థితిపై ఉభయులూ చర్చించారు' అని సెర్గియో గోర్ ఆ ప్రకటనలో తెలిపారు.


ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఐదు రోజులపాటు దాడులు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సోమవారంనాడు సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజులుగా ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే అమెరికాతో చర్చలను ఇరాన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.


పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించాం: మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోనులో సంభాషించినట్టు ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై తమ మధ్య ఉపయోగకరమైన చర్చ జరిగిందన్నారు. వీలైనంత త్వరలో ఉద్రికతలు తొలగేందుకు, శాంతి పునరుద్ధరణకు భారత్ మద్దతు ఉంటుందని తాను స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి తెరవడం, రక్షణ కల్పించడం, అందరికీ అందుబాటులోకి తేవడం యావత్ ప్రపంచానికి అవసరమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

కోవిడ్ విషాదాలను మోదీ మరచిపోయారా... రాహుల్ గాంధీ

పశ్చిమాసియాలో పరిణామాలపై మోదీ అధ్యక్షతన 25న అఖిలపక్ష సమావేశం

Updated Date - Mar 24 , 2026 | 08:05 PM