Share News

ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. స్పందించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 16 , 2026 | 11:58 AM

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ అంతర్జాతీయ సదస్సు సోమవారం ప్రారంభం కానుంది. దీనిపై ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

ఏఐ ఇంపాక్ట్ సదస్సు.. స్పందించిన ప్రధాని మోదీ
PM Modi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సు సోమవారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ సదస్సు ఫలితాలు ప్రగతిశీల, వినూత్నమైన భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడతాయని తాను విశ్వసిస్తు్న్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం.. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ ( అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం) అని తెలిపారు. ఈ సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు, పలు పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, సాంకేతిక ఔత్సాహికులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.


కృత్రిమ మేథస్సు(ఎఐ)పై సదస్సు ఆ రోజు అంటే.. సోమవారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ నేతలు, ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలు, వేలాది మంది ప్రతినిధులు దేశ రాజధాని న్యూఢిల్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలో విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. సదస్సు జరిగే ప్రదేశంతోపాటు పరిసర ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను మోహరించారు. ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రముఖల జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా, గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయి తదితరులు ఉన్నారు.

అలాగే యూరప్, ఆసియా దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సుకు తరలి వచ్చారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు 1.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశాల్లో ఇది అతి పెద్దదని చెబుతున్నారు. ఈ సదస్సు ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

గన్నవరంలో బిల్ గేట్స్‌కు ఘన స్వాగతం..

For More National News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 01:36 PM