అరుణాచల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
ABN , Publish Date - Nov 12 , 2026 | 07:56 PM
భారత్-చైనా సరిహద్దుల వద్ద అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కురుంగ్ కుమే జిల్లాలోని పార్సీ పార్లో అనే ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్-చైనా సరిహద్దుల వద్ద అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కురుంగ్ కుమే జిల్లాలోని పార్సీ పార్లో అనే ఏరియాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. 20 నివాసాలు అగ్నికి బూడిదయ్యాయి. అంతేకాకుండా భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లింది. తమ ఇళ్లు కాలిపోవడంతో పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి కారణం తెలియరాలేదని చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
కాగా.. ఇటీవల ముగిసిన దీపావళి పండుగ సమయంలో కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ, సిక్కిం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళి సమయంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని పలు దుకాణాలు, ఇళ్లు, వాణిజ్య సదుపాయాలు కాలిపోయాయి. లక్ష్మీ పూజ రోజు ఒక్క పుణెలోనే 63 అగ్నిప్రమాదాలు సంభవించాయి.
ఈ వార్తలనూ చదవండి:
అమితాబ్‌కు మూడోసారి బాంబు బెదిరింపు.. భద్రతా బలగాల అలర్ట్
'శామ్ భాయ్'కు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. రాజకీయ విభేదాలు మరచి ఆత్మీయత