Share News

ముంబైలో దారుణం.. రైల్లో యువతిని కిందకు తోసేయడంతో..

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:20 PM

తోటి ప్రయాణికుడు రైలు నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలపాలైన ముంబై యువతి చేయి తొలగించాల్సి వచ్చింది. నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. తాజాగా వైద్యులు దెబ్బతిన్న ఆమె చేయిని తొలగించారు.

ముంబైలో దారుణం.. రైల్లో యువతిని కిందకు తోసేయడంతో..
Mumbai Woman loses hand after being pushed off train

ఇంటర్నెట్ డెస్క్: తోటి ప్రయాణికుడు రైలు నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలపాలైన ముంబై యువతి (22) చేయి తొలగించాల్సి వచ్చింది. నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. తాజాగా వైద్యులు దెబ్బతిన్న ఆమె చేయిని తొలగించారు. నిందితుడిని కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలని యువతి డిమాండ్ చేసింది.


నైగావ్ స్టేషన్‌లో నవంబర్ 4న ఈ ఘటన జరిగింది. నిందితుడు జితేంద్ర హిర్‌ముఖే (53) కూడా నైగావ్ వాసి అని పోలీసులు చెబుతున్నారు. మీడియా కథనాల ప్రకారం, తొలుత నిందితుడు యువతిని అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్కచేయలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన ఆమె నిందితుడిపై చెప్పు విసిరింది. తగాదా పెద్దది కావడంతో ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని గొడవను చల్లార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిందితుడు యువతిని దుర్భాషలాడుతూ ఆమెపై చెప్పు విసిరాడు. ఈలోపు రైలు నైగావ్‌కు చేరుకోవడంతో నిందితుడు ఆమెను కిందకు తోసేశాడు. ప్లాట్‌ఫాంపైకి ఆమె తిరిగి ఎక్కే ప్రయత్నంలో ఉండగా రైలు కదలడంతో ఆమె చేయి చక్రాల కింద పడి నలిగిపోయింది.


ఈ హడావుడిలో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నవంబర్ 9న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేతికి తీవ్ర గాయాలు కావడంలో వైద్యులు అవయవాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని యువతి కోరింది. నిందితుడిపై పెట్టిన కేసుల్లో హత్యాయత్నం అభియోగం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తనకు న్యాయం దక్కుతుందా? అని సందేహం వ్యక్తం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

అమితాబ్‌కు మూడోసారి బాంబు బెదిరింపు.. భద్రతా బలగాల అలర్ట్

'శామ్ భాయ్'కు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. రాజకీయ విభేదాలు మరచి ఆత్మీయత

Updated Date - Nov 12 , 2026 | 06:27 PM