Share News

బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:25 PM

మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. ఈ బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు ఖాయం.. రాహుల్ ఆరోపణల్లో నిజం లేదు: కేంద్రం
132nd Constitutional Amendment Bill

ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. ఈ బిల్లుకు 371 మంది ఎంపీల మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. నవంబరు 30 నుంచి పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ బిల్లులపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది (Delimitation Bill 2026).


లోక్‌సభ స్థానాలను 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం, రాష్ట్రాలవారీగా ప్రస్తుతం ఉన్న స్థానాలను 50 శాతం పెంచడం వంటి ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లుకు అవసరమైన మద్దతు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. మొత్తం 371 మంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మద్దతు అవసరం (132nd Constitutional Amendment Bill).


డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్‌గా నియమించబోతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. గతంలో ఉన్న డీలిమిటేషన్ కమిషన్ చట్టంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయలేదని పేర్కొన్నాయి. మహిళా రిజర్వేషన్ అంశాన్ని మాత్రమే కొత్త డిలిమిటేషన్ కమిషన్ చట్టంలో చేర్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి (Women's Reservation Bill).


సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పడుతుందని, ప్రతి రాష్ట్రంలో 5 గురు ఎంపీలు కమిషన్‌లో సభ్యులుగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి (South India Representation). ఖర్గే ఆరోపణల్లో కూడా నిజం లేదని, ఎస్సీ, ఎస్టీల నియోజకవర్గాలు కూడా 50శాతం పెరుగుతాయని స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరిగేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంగీకరించాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికా సైన్యంపై దాడులు.. ఇరాన్ స్టార్‌లింక్ వినియోగించిందా..


భూకంప సమయంలో విమానాన్ని టేకాఫ్ చేసిన పైలట్‌పై తండ్రి ప్రశంసలు.. అసలేం జరిగిందంటే..

Updated Date - Nov 29 , 2026 | 05:38 PM