-
-
Home » Mukhyaamshalu » Ap Telangana National International ABN Andhrajyothy Latest Breaking and trending news Live Updates of 23th March 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 23 , 2026 | 06:31 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 23, 2026 09:17 IST
QNET కార్యాలయాలపై CCS పోలీసుల దాడులు
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులో ఏకకాలంలో తనిఖీలు
3 రాష్ట్రాల్లో మొత్తం 25 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
20 మంది నిందితులను గుర్తించిన పోలీసులు
CCSలో ఇప్పటికే QNETపై ఆరు కేసుల నమోదు
-
Mar 23, 2026 09:12 IST
ఒక్కో నౌకకు రెండు మిలియన్ డాలర్లు
హోర్ముజ్ జలసంధిలో అనుమతులకు ఇరాన్ చార్జీల విధింపు
యుద్ధం కోసం చార్జీల వసూలు తప్పదన్న ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు
అంతర్జాతీయ మీడియాలో కథనాలు
-
Mar 23, 2026 08:36 IST
నటి భానుప్రియకు మాతృవియోగం
చెన్నై: సీనియర్ నటి భానుప్రియకు మాతృవియోగం
గుండెపోటుతో భానుప్రియ తల్లి ఎం.లక్ష్మి(83) మృతి
-
Mar 23, 2026 08:35 IST
ఢిల్లీ: కేంద్ర బలగాల కోసం ఉమ్మడి చట్టం
నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
అధికారుల నియామకం, డిప్యూటేషన్, ప్రమోషన్..
సర్వీస్‌కు సంబంధించిన అంశాల నియంత్రణకు చట్టం
-
Mar 23, 2026 08:33 IST
సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
10 కీలక బిల్లులపై చర్చించనున్న కేబినెట్
-
Mar 23, 2026 08:32 IST
హైదరాబాద్: సంతోష్‌నగర్‌లో యువకుడి దారుణ హత్య
సయ్యద్ లాయక్(26)ను హత్య చేసిన స్నేహితులు
ఇటీవలే జైలు నుంచి విడుదలైన సయ్యద్, ఆదిల్, సల్మాన్
హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానం
-
Mar 23, 2026 07:34 IST
నేడు బీజేపీ ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపు
6 గ్యారెంటీల విస్మరణ, బడ్జెట్‌లో విద్య, వైద్యానికి సరైన కేటాయింపులు లేవని నిరసన
-
Mar 23, 2026 07:32 IST
పసిఫిక్ మహా సముద్రంలో భూప్రకంపనలు
రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదు
-
Mar 23, 2026 07:07 IST
నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇవీ
హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,45,960
22 క్యారెట్ బంగారం ధర రూ.1,33,790
కిలో వెండి ధర రూ.2,49,900
-
Mar 23, 2026 07:06 IST
అమేలియా కెర్ ప్రపంచ రికార్డు
ప్రపంచ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్ అమేలియా కెర్
వరుసగా 10 టీ20 మ్యాచుల్లో 30+ స్కోర్ చేసిన ఏకైక ప్లేయర్
-
Mar 23, 2026 06:38 IST
ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో నేడు మరో ముందడుగు
నేడు రాజయ్యపేటలో AMNS స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ
రూ.1.36 లక్షల కోట్లతో ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ
స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి కుమారస్వామి
భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్
-
Mar 23, 2026 06:36 IST
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల
ఎకరా వరకు రైతులకు రూ.3,590 కోట్ల విడుదల
నేడు రైతుల ఖాతాల్లో నిధులను జమచేయనున్న సర్కార్
వచ్చే నెలాఖరు నాటికి 73 లక్షల మంది రైతులకు నిధులు
-
Mar 23, 2026 06:35 IST
నేడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ
వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లుతో పాటు..
బేవరేజెస్ నివేదిక ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్స్‌తో పాటు..
పే స్ట్రక్చర్ సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ
-
Mar 23, 2026 06:34 IST
ఏపీలో గ్యాస్ పరిస్థితిపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష
అందుబాటులో ఉన్న గ్యాస్, భవిష్యత్ అవసరాలపై రివ్యూ
త్వరలో ఏజెన్సీలో కిరోసిన్ పంపిణీ యోచనలో ప్రభుత్వం