Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 07 , 2026 | 06:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 07, 2026 21:39 IST

    ఏపీ డేటా సెంటర్ పైప్‌లైన్‌ను కొరియా కంపెనీలు వినియోగించుకోవాలి: మంత్రి లోకేశ్

    • అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు చర్యలు: నాదెండ్ల

    • ఏపీకి VBG RAM G నుంచి తొలి విడతగా రూ.2,545 కోట్ల విడుదల

    • సీఐ నాగరాజును కృష్ణలంక పీఎస్‌లో సిట్‌ విచారించేందుకు హైకోర్టు అనుమతి

  • Jul 07, 2026 21:36 IST

    Ind vs Eng: టాస్ నెగ్గిన భారత్

    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్

    • రాత్రి 10:00 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

  • Jul 07, 2026 21:22 IST

    కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

    • కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: సీఎం రేవంత్‌రెడ్డి

    • కేసీఆర్ కోరిన తేదీన అసెంబ్లీ నిర్వహిస్తాం: రేవంత్‌రెడ్డి

  • Jul 07, 2026 20:32 IST

    కామారెడ్డి: జిల్లాలో కలకలం రేపిన ఆరేళ్ల బాలిక కిడ్నాప్

    • మద్నూర్ వారాంతపు సంతలో బాలికను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

    • బాలిక మద్నూర్ మండలం మీర్జాపూర్‌కు చెందినదిగా గుర్తింపు

    • కేసును చాకచక్యంగా చేధించిన పోలీసులు

    • మహారాష్ట్రలోని దేగ్లూర్‌లో చిన్నారి ఆచూకీ లభ్యం

    • ప్రస్తుతం పోలీసుల కస్టడీలో బాలిక

  • Jul 07, 2026 20:07 IST

    అమరావతి: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

    • అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం

    • ఏజెంట్ల సహకారంతో బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయం

    • ఆస్తుల పరిరక్షణకు రెవెన్యూ శాఖకు ప్రత్యేక ఆదేశాలు

    • అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు: నాదెండ్ల

  • Jul 07, 2026 19:47 IST

    కేసీఆర్, కేటీఆర్‌ ఇంజినీర్లు కాదు.. మానిప్యులేటర్లు: రేవంత్‌

    • అబద్ధాలతో మభ్యపెట్టడమే వారిద్దరి నైపుణ్యం: రేవంత్‌

    • అబద్ధాలు చెప్పడంలో వారికి వారే సాటి: సీఎం రేవంత్‌

    • ప్రాజెక్ట్ అంచనా రూ.1.47 లక్షల కోట్లకు చేరిందన్న కాగ్‌: రేవంత్

    • అబద్ధాల రావుల మాటల్ని నాటి గవర్నర్ నమ్మారు: రేవంత్‌

    • డబ్బుల కొల్లగొట్టాలన్న ఆశతో ప్రాజెక్ట్ ప్రారంభించారు: రేవంత్‌

    • పక్క రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి యజ్ఞాలు చేశారు: రేవంత్‌

  • Jul 07, 2026 19:39 IST

    మహారాష్ట్రలోని జలగావ్‌ జిల్లాలో కుండపోత

    • ఉధృతంగా ప్రవహిస్తున్న తాపీ నది

    • హత్నూర్ డ్యామ్‌కు పోటెత్తిన భారీ వరద

  • Jul 07, 2026 19:23 IST

    ప్రకాశం: పూరీ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసుల తనిఖీలు

    • గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

    • 10 కిలోల గంజాయి స్వాధీనం

  • Jul 07, 2026 19:17 IST

    మా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం: సీఎం రేవంత్‌

    • మా ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యం: సీఎం రేవంత్‌

    • ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే ఇస్తున్నాం: రేవంత్‌

    • ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం: రేవంత్‌

    • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం: సీఎం రేవంత్‌

    • 2034లోగా కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం: రేవంత్‌

  • Jul 07, 2026 19:06 IST

    ఏపీకి VBG RAMG నుంచి తొలి విడతగా రూ.2,545 కోట్లు విడుదల

    • తొలి విడత నిధుల వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి పెమ్మసాని

    • గ్రామీణాభివృద్ధికి కేంద్రం ఇచ్చే మరో భారీ ఊతం: పెమ్మసాని

  • Jul 07, 2026 18:25 IST

    అమరావతి: ఆగస్టు 13 నుంచి విజయవాడ-వారణాసి, కోల్‌కతా విమాన సేవలు

    • వారానికి 3 రోజులు విమాన సేవలు: మంత్రి కందుల దుర్గేశ్

    • పోప్టర్ విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేశ్

  • Jul 07, 2026 18:21 IST

    హైదరాబాద్‌: జన్వాడ ఫామ్‌హౌస్‌–హుస్సేన్‌సాగర్‌ ప్రాజెక్టు లింక్‌పై సచివాలయంలో చర్చ

    • ప్రదీప్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు FTLలో అనుమతులపై చర్చ

    • భూమి లేకుండానే 17 అంతస్తుల టవర్లకు గ్రీన్ సిగ్నల్?

    • మొత్తం స్థలం FTL, బఫర్‌జోన్‌లోనే ఉందని అధికారుల నివేదిక

  • Jul 07, 2026 18:18 IST

    హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

    • ఓనర్ వేలిముద్ర, OTP లేకుండానే రిజిస్ట్రేషన్‌

    • అన్నింటినీ బైపాస్ చేస్తూ సాఫ్ట్‌వేర్ల వినియోగం

    • విదేశాల్లో ఉన్నవాళ్లకు తెలియకుండానే పేర్ల మార్పు

    • 8 లక్షల లావాదేవీలపై ఆడిట్‌, 22 వేల రిజిస్ట్రేషన్లలో తేడాల గుర్తింపు

    • కేరళ సెక్యూరిటీ ఆడిట్ సంస్థతో నివేదికలో వెల్లడి

  • Jul 07, 2026 18:18 IST

    ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

    • ధరణి అక్రమాలపై ABN ఆంధ్రజ్యోతి కథనాలు

    • ధరణి పోర్టల్‌ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌

    • అక్రమాలపై విచారణకు ఆదేశించే యోచనలో ప్రభుత్వం

    • విజిలెన్స్ విచారణ లేదా సిట్ ఏర్పాటుచేసే అవకాశం

  • Jul 07, 2026 18:17 IST

    సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ

    • సీఎంకు 3 పేజీల లేఖ రాసిన కొండా సురేఖ

    • MLA కడియం శ్రీహరి తీరుపై సీఎంకు కొండా సురేఖ ఫిర్యాదు

    • అధికారులతో కడియం శ్రీహరి సమీక్షపై కొండా సురేఖ అభ్యంతరం

    • నాకు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి సమీక్ష జరిపారు: కొండా సురేఖ

    • దేవాదాయ శాఖలో MLA జోక్యం సరికాదు: మంత్రి కొండా సురేఖ

    • క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

  • Jul 07, 2026 18:11 IST

    హైదరాబాద్: తెలంగాణ టూరిజం అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

    • పర్యాటక రంగం అభివృద్ధిపై అధికారులతో జూపల్లి విస్తృత సమావేశం

    • తెలంగాణ టూరిజంపై మంత్రి జూపల్లి కీలక నిర్ణయాలు

    • పర్యాటక అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశం

    • కొత్త టూరిజం డెస్టినేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశం

  • Jul 07, 2026 18:03 IST

    మెదక్‌: కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు

    • ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యార్థులను చేర్చుకోవడం లేదంటూ కలెక్టర్ ప్రతిమా సింగ్ వాహనం అడ్డగింత, బైఠాయింపు

    • విద్యార్థుల తల్లిదండ్రులను బుజ్జగించిన DSP ప్రసన్నకుమార్

    • విద్యార్థులను చేర్చుకునే అంశంపై ఇప్పటికే స్కూల్‌ మేనేజ్‌మెంట్స్‌తో మాట్లాడిన కలెక్టర్ ప్రతిమా సింగ్

    • రెండు రోజుల నుంచి కలెక్టరేట్‌ వద్ద పిల్లలతో తల్లిదండ్రుల ఆందోళన

  • Jul 07, 2026 17:56 IST

    అమరావతి: ముగిసిన CRDA సమావేశం

    • 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్‌కు భూములిస్తున్న రైతులకు కౌలు రూ.40 వేలు ఇచ్చేందుకు CRDA ఆమోదం

    • భూములిచ్చినప్పటి నుంచి పదేళ్ల పాటు అమలు

    • ఏటా జరీబు భూమికి ఎకరాకు రూ.5 వేల పెంపు

    • మెట్ట భూమికి ఎకరాకు రూ.3 పెంచేందుకు CRDA ఆమోదం

    • గ్రామ కంఠాల్లో భూములు కోల్పోతున్న వారికి ఏడాదికి రూ.10 వేలు

  • Jul 07, 2026 17:54 IST

    హైదరాబాద్‌: వనస్థలిపురం ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం

    • లారీ కంటైనర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

    • మంటల ధాటికి పేలిన డీజిల్ ట్యాంక్‌, కంటైనర్ ముందు భాగం దగ్ధం

    • కర్ణాటక నుంచి డాల్డా లోడ్‌తో వచ్చిన లారీ

    • డ్రైవర్ అప్రమత్తతతో తప్పినముప్పు

  • Jul 07, 2026 17:43 IST

    విశాఖ: సముద్రంలో ముగిసిన సెర్చ్ ఆపరేషన్‌

    • లభించని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ

    • త్రిసభ్య కమిటీకి సెర్చ్ రిపోర్ట్ సమర్పణ

    • నివేదిక సిద్ధం చేయనున్న త్రిసభ్య కమిటీ

    • పరిహారంపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

    • తీర ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తామన్న అధికారులు

  • Jul 07, 2026 17:39 IST

    ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో ఈడీ కస్టడీ పిటిషన్‌

    • నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌ను వారం రోజులు కస్టడీకి కోరిన ఈడీ

    • ముగిసిన ఇరుపక్షాల వాదనలు

    • ఈ నెల 14న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం

  • Jul 07, 2026 17:32 IST

    అమరావతి: రేప‌టి నుంచి స‌ద‌రం స్లాట్ల బుకింగ్‌ ప్రారoభం

    • దివ్యాంగుల డేటాకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రత

    • జోనళ్ల విధానంలో స్లాట్ బుకింగ్ దివ్యాoగులకు ఉపయుక్తం

    • తొలి వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితంపై అప్పీళ్లకు 2 సార్లు ఛాన్స్‌

  • Jul 07, 2026 17:14 IST

    అమరావతి: అమెరికాలో ఏపీ వాసి మృతి

    • న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అట్లూరి ప్రసన్న మృతి

    • అట్లూరి ప్రసన్న స్వగ్రామం ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు

    • సిగ్నల్‌ వద్ద ప్రసన్న కారును ఢీకొన్న మరో వాహనం

    • అక్కడికక్కడే ప్రసన్న సహా మరో అమ్మాయి మృతి

    • మరో వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Jul 07, 2026 17:07 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన CRDA సమావేశం

    • పాల్గొన్న మంత్రి నారాయణ, సీఎస్‌ సాయిప్రసాద్‌, ఉన్నతాధికారులు

    • రెండో దశ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చ

    • వివిధ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులపై చర్చ

  • Jul 07, 2026 17:01 IST

    ఢిల్లీ: NCERT కీలక నిర్ణయం

    • 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం సవరణ

    • NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ కొత్త పాఠ్యపుస్తకం విడుదల

    • న్యాయ వ్యవస్థపై ఉన్న వివాదాస్పద పాఠాలు పూర్తిగా తొలగింపు

    • కోర్టుల్లో అవినీతి, భారీగా కేసుల పెండింగ్ తదితర ప్రతికూల అంశాలను సిలబస్ నుంచి తొలగించిన NCERT

  • Jul 07, 2026 16:55 IST

    అమరావతి: అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం: మంత్రి కొల్లు రవీంద్ర

    • MRPకి మించి మద్యం అమ్మితే షాపులు సీజ్‌ చేస్తాం: మంత్రి కొల్లు

    • విశాఖ, సూర్యలంకలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి కొల్లు

    • 5స్టార్ హోటల్స్ ద్వారా బీచ్ షాక్స్‌లో మద్యం విక్రయాలు: మంత్రి

    • వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

  • Jul 07, 2026 16:43 IST

    హైదరాబాద్: హైకోర్టులో సలార్‌ ఏ మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్ పిటిషన్

    • ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషన్ క్యాంపస్‌ను కూల్చవద్దంటూ లంచ్ మోషన్ పిటిషన్

    • ఆగస్టు 3 వరకు చర్యలు వద్దన్న హైకోర్టు

  • Jul 07, 2026 16:38 IST

    ఢిల్లీ: చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సభ్యత్వాల రద్దు

    • ట్రస్ట్ నుంచి ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేసినట్టు రామాలయ ట్రస్ట్ ప్రకటన

    • చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ట్రస్టీలుగానూ కొనసాగడం లేదని తేల్చిచెప్పిన ట్రెజరర్

    • ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు గోపాల్ నాగర్‌కట్టే(గోపాల్‌రావు)పై వేటు

    • రిటైర్డ్ IFS కృష్ణమోహన్‌ను పూర్తిస్థాయి జనరల్ సెక్రటరీగా నియమించే అంశంపై ఈ నెల 22న ట్రస్ట్ నిర్ణయం

  • Jul 07, 2026 16:31 IST

    అఫ్గానిస్థాన్ క్రికెట్‌లో విషాదం

    • మాజీ క్రికెటర్ షాపూద్ జద్రాన్ కన్నుమూత

    • అధికారికంగా ప్రకటించిన అఫ్గాన్ క్రికెట్ బోర్డు

    • అరుదైన వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన జద్రాన్

  • Jul 07, 2026 16:30 IST

    అమరావతి: ప్రభుత్వంపై బురద జల్లడమే గొడ్డలి పార్టీ పని: మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

    • జోసెఫ్ రావణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పా?: రాంప్రసాద్ రెడ్డి

    • జోసెఫ్‌ రావణ్‌కు జగన్‌ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు: రాంప్రసాద్‌ రెడ్డి

    • అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం: రాంప్రసాద్‌ రెడ్డి

    • ఐదేళ్ల YCP పాలనలో ఏపీ 15 ఏళ్లు వెనక్కి వెళ్లింది: రాంప్రసాద్‌ రెడ్డి

  • Jul 07, 2026 16:12 IST

    కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్

    • మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్

    • 4 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఎల్‌జీ మాగోక్ క్యాంపస్

    • రోబోటిక్స్, OLED, AI, బ్యాటరీ టెక్నాలజీలను పరిశీలించిన లోకేశ్

    • భవిష్యత్తు సాంకేతికతకు మాగోక్ సైన్స్ పార్క్ అద్దం పడుతోంది: లోకేశ్

  • Jul 07, 2026 15:59 IST

    హైదరాబాద్‌: మియాపూర్ హత్య కేసులో సంచలన విషయాలు

    • ప్రియుడు మధుసూదన్‌రెడ్డి, స్నేహితుడు రాజేశ్‌తో కలిసి పెంటేశ్ హత్య

    • భోజనంలో నిద్ర మాత్రలు కలిపిన భార్య సత్యవతి

    • మహారాష్ట్రకు పెంటేశ్‌ను తీసుకెళ్లిన భార్య, ప్రియుడు, స్నేహితుడు

    • పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టిన భార్య, ప్రియుడు

    • మృతదేహాన్ని గుర్తించి కేసు దర్యాప్తు చేసిన మహారాష్ట్ర పోలీసులు

    • భార్య కాల్ లిస్ట్‌తో వెలుగులోకి వచ్చిన హత్య ఘటన

  • Jul 07, 2026 15:57 IST

    కేరళం: వయనాడ్ జిల్లా కల్లాడి వద్ద భారీగా విరిగిపడిన కొండచరియలు

    • ఈ ప్రమాదంలో ముగ్గురి మృతి, ఆరుగురిని రక్షించిన స్థానికులు

    • ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు

    • శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

  • Jul 07, 2026 15:49 IST

    నష్టాలతో ముగిసిన దేశీయ సూచీలు

    • 104 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

    • 31 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.96

  • Jul 07, 2026 15:23 IST

    హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

    • డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించండి: రేవంత్ రెడ్డి

    • పరిపాలన వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకెళ్లాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Jul 07, 2026 15:13 IST

    విజయవాడ: హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: డిప్యూటీ సీఎం పవన్‌

    • జాతి గొప్పతనం నిర్మించిన భవనాల్లో కాదు, కళాకారుల్లో కనిపిస్తుంది: పవన్‌

    • కళాకారుల అద్భుత ప్రతిభ, కష్టాన్ని గుర్తించడానికి వచ్చా: పవన్‌ కల్యాణ్‌

  • Jul 07, 2026 15:12 IST

    హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై జిల్లాస్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమాలు

    • రేపటి నుంచి 3 రోజులపాటు అన్ని జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు

    • కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు

  • Jul 07, 2026 15:11 IST

    మార్కాపురం: అర్ధవీడు మం. మిట్టమీదిపల్లిలో కొడుకుపై తండ్రి క్రికెట్ బ్యాట్‌తో దాడి

    • తీవ్ర గాయాలైన జావెద్‌ను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి

    • కొడుకు మృతితో ఆందోళనతో ఇంట్లో ఉరివేసుకుని తండ్రి పఠాన్ సిలార్(58) ఆత్మహత్య

    • ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు

  • Jul 07, 2026 15:04 IST

    పుణె: రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకేసులో మరో సంచలన విషయం

    • నాలుగు నెలల కిందటే సియా గోయల్‌ను ఆమె ప్రియుడు పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణ

    • రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారని ఆరోపిస్తున్న పోలీసులు

    • దీనికి సంబంధించిన అధికారిక పత్రాల కోసం కొనసాగుతున్న విచారణ

  • Jul 07, 2026 14:52 IST

    ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మం. పెరంపేటలో దారుణం

    • పెరంపేట రైతు భరోసా కేంద్రం మెట్లపై కారుమూరి దుర్గారెడ్డిని కత్తితో నరికి చంపిన వైనం

    • దుర్గారెడ్డిని హతమార్చిన అన్నయ్య కొడుకు కారుమూరి శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులు

    • ఆస్తి, పొలం వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికుల ఆరోపణలు

  • Jul 07, 2026 14:46 IST

    యూపీలో ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు

    • రూ.20వేలు ఎస్ఐ దొంగిలించాడన్న ట్రక్ డ్రైవర్

    • లిఫ్ట్ ఇస్తే చోరీకి తెగబడ్డారని ఎస్‌ఐపై ఆగ్రహం

    • నడిరోడ్డుపై ఎస్‌ఐ, ట్రక్ డ్రైవర్ వాదులాట

    • నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

  • Jul 07, 2026 14:36 IST

    టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో షాక్

    • ఆసియా క్రీడల జట్టులోనూ స్థానం దక్కలేదని సమాచారం

    • ఇప్పటికే జింబాబ్వే టూర్ దూరమైన సంజూ

  • Jul 07, 2026 14:32 IST

    కేంద్రమంత్రులు ఖట్టర్, కిషన్‌రెడ్డికి ఎంపీ మల్లు రవి లేఖ

    • హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్, ఫేజ్-2 విస్తరణపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

    • మెట్రోపై సీఎం రాసిన లేఖ అంశాలను మరోసారి కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లిన మల్లురవి

  • Jul 07, 2026 14:24 IST

    హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం

    • ప్రియుడితో కలిసి భర్తను చంపి, పూడ్చిపెట్టిన భార్య

    • భర్త కనిపించడం లేదని 2025 నవంబర్‌లో మహిళ ఫిర్యాదు

    • కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు

    • భర్తను భార్యనే చంపి పూడ్చిపెట్టినట్టు గుర్తించిన పోలీసులు

    • భార్య కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల నిర్ధారణ

  • Jul 07, 2026 14:20 IST

    ఫ్రాన్స్ ప్రెసిడెంట్‌ మెక్రాన్‌కు తప్పినముప్పు

    • సిరియా పర్యటనలో ప్రెసిడెంట్ మెక్రాన్‌

    • మెక్రాన్ బస చేసిన హోటల్‌ దగ్గర భారీ పేలుడు

    • ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మెక్రాన్ సురక్షితం

  • Jul 07, 2026 14:12 IST

    ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట

    • ఈసీ నోటీసులకు జవాబిచ్చేందుకు కవితకు వారం రోజుల గడువు

    • TRS పార్టీ పేరు కోసం ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్‌

    • కవిత వాదనలు విని తుది నిర్ణయం తీసుకోవాలని ఈసీకి కోర్టు సూచన

  • Jul 07, 2026 12:42 IST

    కేరళం: వయనాడ్‌లో భారీ వర్షాలు

    • వయనాడ్‌లో విరిగిపడ్డ కొండచరియలు

    • శిథిలాల కింద చిక్కుకున్న పలువురు

    • కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jul 07, 2026 12:32 IST

    భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను వేగంగా పూర్తి చేశాం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • ఎయిరో డ్రో లైసెన్స్ కూడా వచ్చింది: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

    • ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం: రామ్మోహన్‌ నాయుడు

    • మోదీ షెడ్యూల్ ఖరారైన తర్వాత తేదీ ప్రకటిస్తాం: రామ్మోహన్‌ నాయుడు

    • ఎయిర్‌పోర్టు ప్రారంభమైన వారం తర్వాత ఆపరేషన్స్: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • Jul 07, 2026 12:31 IST

    బెంగాల్: సీఎం సువేందు అధికారి సంచలన ప్రకటన

    • సిలబస్ నుంచి సింగూర్ టాటా నానో ఉద్యమ పాఠం తొలగింపు

    • సింగూర్ ఉద్యమ పాఠాన్ని తొలగించాలని విద్యాశాఖకు సీఎం ప్రతిపాదన

    • పరిశ్రమలను తరిమేసిన వారి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో ఉండకూడదన్న సీఎం

  • Jul 07, 2026 12:30 IST

    హైదరాబాద్: DSP భీమ్‌రెడ్డి డైరీలో కీలక వివరాలు

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలకంగా మారిన డైరీ

    • చార్‌ధామ్ యాత్రకు ముందే డైరీ రాసుకున్న భీమ్‌రెడ్డి

    • డైరీలో బినామీల పేర్లతో పాటు ఆస్తుల వివరాల నమోదు

    • అరెస్ట్‌కు ముందు వారం క్రితం పలు లావాదేవీల గుర్తింపు

    • బినామీలుగా వాచ్‌మెన్, హోంగార్డులు సహా 15 మంది

    • డైరీలోని ఆస్తులపై దర్యాప్తు చేస్తున్న ACB

  • Jul 07, 2026 11:47 IST

    DMK పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

    • DMK పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

    • కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్, మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని DMK పిటిషన్

    • గ్యాగ్ ఆర్డర్ జారీ చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం

    • అప్లికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకున్న DMK

  • Jul 07, 2026 11:47 IST

    ముంబైలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం, ఆరెంజ్ అలర్ట్

    • వర్షాలతో మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు

    • పాక్షికంగా మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు

  • Jul 07, 2026 11:42 IST

    గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

    • 2008 అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు

    • కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు

    • ఇదే కేసులో మరో 11 మందికి జీవిత ఖైదు

    పూర్తి కథనం..

  • Jul 07, 2026 11:40 IST

    అమరావతి: క్రమశిక్షణా చర్యల కేసులపై సీఎస్‌ ఆదేశాలు

    • 7,827 క్రమశిక్షణ కేసుల్లో 11,600 మందికిపైగా ఉద్యోగులు

    • పెండింగ్ కేసులను కాలపరిమితిలో పూర్తి చేయాలని నిర్ణయం

    • కేసుల పర్యవేక్షణకు నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు

  • Jul 07, 2026 11:39 IST

    తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టు నోటీసులు

    • సీఎం విజయ్ గెలుపును సవాల్ చేస్తూ పిటిషన్ల దాఖలు

    • పిటిషన్లను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు

    • మంత్రి ఆదవ్ అర్జున్ విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా అడ్మిట్ చేసిన జస్టిస్ వి.లక్ష్మీనారాయణ్ బెంచ్

  • Jul 07, 2026 11:39 IST

    తమిళనాడు: నీలగిరిలో భారీ వర్షాలు

    • చేరంబాడిలో 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

  • Jul 07, 2026 11:38 IST

    ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

    • బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియాను ప్రకటించిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాం

    • ఇది భారత ప్రజలకు లభించిన గౌరవం: ప్రధాని మోదీ

  • Jul 07, 2026 11:37 IST

    రెండో రోజు ఇండోనేసియాలో ప్రధాని మోదీ పర్యటన

    • ఇండోనేసియాలో ప్రధాని మోదీ కీలక ఒప్పందాలు

    • భారత్ నుంచి ఆస్ట్రా క్షిపణుల దిగుమతికి ఇండోనేసియా నిర్ణయం

    • ఇండోనేసియాలో ఉక్కు, నికెల్, అయస్కాంతాల తయారీలో భారత్ పెట్టుబడి

    • ఇండోనేసియాలో బ్రహ్మోస్ అభివృద్ధికి భారత్ సహకారం

    • రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం

  • Jul 07, 2026 11:10 IST

    హైదరాబాద్: ఖైరతాబాద్‌ RTA కార్యాలయం ఎదుట ఉద్రిక్తత

    • భవన నిర్మాణ కాంక్రీట్ మిక్సర్ల అసోసియేషన్ ప్రతినిధుల ధర్నా

    • మిక్సర్ల వాహనాలకు ఇష్టానుసారంగా చలానాలు వేస్తున్నారని నిరసన

    • RTA కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నం

    • అడ్డుకున్న పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం

  • Jul 07, 2026 10:40 IST

    విజయవాడ: జగన్ అవినీతిపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు

    • ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో జగన్‌పై ఉదాసీనత ఎందుకు?: చింతా మోహన్

    • జయలలితకు ఒక న్యాయం.. జగన్‌కు ఒక న్యాయమా?: చింతా మోహన్

    • జగన్‌పై అనేక కేసులున్నా.. కోర్టులో విచారణకు రాని పరిస్థితి: చింతా మోహన్

    • ప్రజల్లో న్యాయస్థానాలపై నమ్మకం కలిగించేలా చేయాలి: చింతా మోహన్

  • Jul 07, 2026 10:39 IST

    చైనాలో విరిగిపడిన కొండచరియలు

    • చిక్కుకుపోయిన 33 మంది

    • 11 మందిని కాపాడిన సహాయక సిబ్బంది

  • Jul 07, 2026 10:39 IST

    జనగామలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

    • ఇంట్లో ఉరేసుకుని మల్లయ్య బలవన్మరణం

    • 33 పేజీల సూసైడ్ నోట్ రాసిన మల్లయ్య

    • తన చావుకు బావమరుదులు కారణమని సూసైడ్ నోట్

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 07, 2026 10:37 IST

    అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ చేతికి కీలక ఆధారాలు

    • యూపీ ప్రభుత్వానికి అందించిన రిపోర్టులో సిట్ వెల్లడి

    • ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకూ కౌంటింగ్ చేసిన వ్యక్తులు

    • డబ్బులు అపహరిస్తున్నట్టు సీసీ ఫుటేజీలో గుర్తింపు

    • 70 సార్లు చోరీకి పాల్పడినట్టు గుర్తించిన సిట్

    పూర్తి కథనం..

  • Jul 07, 2026 10:36 IST

    తగ్గిన బంగారం ధరలు

    • రూ.1360 తగ్గి రూ.1,45,260కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1250 తగ్గి రూ.1,33,150కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,45,000

    పూర్తి కథనం..

  • Jul 07, 2026 10:31 IST

    మధ్యప్రదేశ్: మైహార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    • ట్రక్కును ఢీకొట్టిన కారు, ఐదుగురి మృతి

    • కుటుంబమంతా బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తుండగా ఘటన

  • Jul 07, 2026 09:42 IST

    విశాఖ: పెందుర్తి పరిధి ప్రహ్లాదపురంలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి

    • వృద్ధురాలు కర్రీ పైడమ్మ(70) అనుమానాస్పద మృతి

    • వృద్ధురాలిని చంపి 4తులాల బంగారం, చెవిపోగులను దోచుకెళ్లిన దుండగులు

    • కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jul 07, 2026 09:40 IST

    ములుగు: జాతీయ వారసత్వ సంపదగా పాలంపేట శివాలయం

    • జాతీయ ప్రాధాన్యత హోదా కల్పించిన కేంద్రం

    • పురావస్తుశాఖ ఆధీనంలోకి పాలంపేట శివాలయం

    • ఎన్‌ఎంఏ పర్యవేక్షణలో ఆలయ సంరక్షణ

    • రామప్ప ఆలయం దగ్గరలోనే శివాలయం

  • Jul 07, 2026 09:32 IST

    స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

    • 18 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

    • 12 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.33

  • Jul 07, 2026 08:34 IST

    వికారాబాద్: పరిగిలోని పలు పాన్‌షాపుల్లో పోలీసుల ఆకస్మిక దాడులు

    • నిషేధిత గుట్కా, పాన్‌మసాలా ప్యాకెట్ల స్వాధీనం

    • హుక్కాలో వాడే నిషేధిత వస్తువులను ఎక్కడి నుంచి తెస్తున్నారనే దానిపై పోలీసుల ఆరా

  • Jul 07, 2026 08:33 IST

    విజయనగరం: నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు తుది మెరుగుదలపై సమీక్ష

    • హాజరుకానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, పలువురు MLAలు

  • Jul 07, 2026 08:32 IST

    సౌత్ కొరియాలో మూడో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • హ్యుందాయ్ మోబిస్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ భేటీ

    • ఏపీలో ఈవీ సెమీకండక్టర్స్‌ హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి

    • విశాఖలో హ్యుందాయ్ మోబిస్ R&D, ఇంజినీరింగ్ విభాగానికి ప్రతిపాదన

    • తిరుపతి, అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి

  • Jul 07, 2026 08:25 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

    • ఉదయం 11గంటలకు SIPB సమావేశంలో పాల్గొననున్న సీఎం

    • మధ్యాహ్నం 2:30కు CRDA భేటీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Jul 07, 2026 08:15 IST

    నేడు కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్

    • ప్రెజెంటేషన్‌తో కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇవ్వనున్న ప్రభుత్వం

    • హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • Jul 07, 2026 08:06 IST

    విశాఖ: కంచరపాలెం సమీపంలో బోల్తా పడిన టాటా ఏస్ వాహనం

    • డివైడర్ పైనున్న చెట్టును ఢీకొని సర్వీస్ రోడ్డులో బోల్తాపడ్డ వాహనం

    • ప్రమాదంలో పార్కింగ్‌‌‌లో ఉన్న రెండు ద్విచక్ర వాహనాల ధ్వంసం

    • ద్రాక్ష లోడుతో వస్తున్న కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు చెందిన టాటా ఏస్

    • ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు అతడి భార్యకు స్వల్ప గాయాలు

  • Jul 07, 2026 08:03 IST

    నేడు తూ.గో, ఏలూరు జిల్లాల్లో మంత్రి నిమ్మల పర్యటన

    • అనపర్తిలో టీడీపీ కేడర్ మీటింగ్‌లో పాల్గొననున్న నిమ్మల

    • ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను పరిశీలించనున్న మంత్రి

    • మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్ట్ క్షేత్రస్థాయి పరిశీలన

    • పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష

  • Jul 07, 2026 07:58 IST

    ఫిఫా ప్రపంచ కప్: అమెరికాకు షాక్..

    • అమెరికాపై 1-4 తేడాతో బెల్జియం ఘన విజయం

    • టోర్నీ నుంచి అమెరికా ఔట్

  • Jul 07, 2026 07:46 IST

    హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

    • మిస్సైల్ దాడులతో మంటల్లో చిక్కుకున్న చమురు ట్యాంకర్

  • Jul 07, 2026 07:42 IST

    తిరుపతి: వైసీపీ నాయకులపై కేసు నమోదు

    • శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పీఎస్‌లో కేసు నమోదు

    • ఎస్పీ కార్యాలయం ఎదుట నిన్న వైసీపీ నిరసన

    • వైసీపీ నేతలు చెవిరెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, రఘునాథరెడ్డి తదితరులపై కేసు

    • పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు

  • Jul 07, 2026 07:41 IST

    హైదరాబాద్: DSP భీమ్‌రెడ్డికి రిమాండ్

    • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్

    • చంచల్‌గూడ జైలుకు భీమ్‌రెడ్డి తరలింపు

    • రూ.300కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన ACB

  • Jul 07, 2026 07:13 IST

    హైదరాబాద్: నేడు ప్రజాభవన్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశం

    • ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన కల్పించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    • కాళేశ్వరం కుంగుబాటు, NDSA నివేదికలు, సాంకేతిక అంశాలపై అవగాహన

    • పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు

  • Jul 07, 2026 07:12 IST

    నేడు ఖమ్మం కమిషనరేట్‌కు డీజీపీ సీవీ ఆనంద్

    • రహదారి భద్రత అవగాహన కేంద్రం ప్రారంభం

    • వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్న సీవీ ఆనంద్

  • Jul 07, 2026 07:12 IST

    ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ

    • జకార్తాలో మోదీ విమానానికి ఎస్కార్ట్‌

    • ఫైటర్‌ జెట్‌లతో స్వాగతం పలికిన ఇండోనేషియా

    • ఘనస్వాగతం పలికిన ప్రెసిడెంట్‌ ప్రబోవో సుబియాంటో

    • నేడు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు

  • Jul 07, 2026 07:11 IST

    పాకిస్థాన్‌కు చినాబ్‌ జలాల విడుదల

    • భారీ వర్షాలతో సలాల్‌ డ్యామ్‌లో పెరిగిన నీటిమట్టం

    • నీటిమట్టం పెరగడం వల్లే దిగువకు నీటి విడుదల

    • సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించం: కేంద్రం

  • Jul 07, 2026 07:10 IST

    నేడు కడపలో జగన్‌ పర్యటన

    • ఉదయం 10 గంటలకు పులివెందులకు జగన్‌

    • 11 గంటల నుంచి 6 వరకూ ప్రజాదర్బార్‌

    • రేపు ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళులు అర్పించనున్న జగన్

  • Jul 07, 2026 06:58 IST

    ఫిఫా ప్రపంచ కప్: టోర్నీ నుంచి పోర్చుగల్ ఔట్..

    • స్పెయిన్‌పై 1-0 తేడాతో ఓడిన పోర్చుగల్

    • మైదానంలోనే కన్నీటి పర్యంతమైన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో

    • ఇదే ఆఖరి ప్రపంచ కప్ మ్యాచ్ అని ఇప్పటికే ప్రకటించిన రొనాల్డో

    పూర్తి కథనం..

  • Jul 07, 2026 06:18 IST

    మహారాష్ట్ర: భారీ వర్షాల విధ్వంసం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

    • వరదల విధ్వంసంతో ఇప్పటివరకూ 16 మంది మృతి

    • ముంబై-పుణె పరిధిలో తీవ్ర నష్టం

    • కొండచరియలు విరిగిపడి కొట్టుకుపోయిన రైల్వే ట్రాకులు

    • మరో రెండు రోజులు భారీ వర్షాలు

    • ముంబై సహా పలు జిల్లాలకు IMD రెడ్ అలర్ట్‌

  • Jul 07, 2026 06:02 IST

    పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

    • బెంగాల్‌లో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

    • నేడు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

  • Jul 07, 2026 06:01 IST

    నేడు మూడో T20లో భారత్‌ Vs ఇంగ్లాండ్‌

    • నాటింగ్‌హామ్‌లో రాత్రి 10 గంటలకు మ్యాచ్‌