Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 06 , 2026 | 05:50 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 06, 2026 08:00 IST

    వికారాబాద్: పరిగి బహార్ పేట చౌరస్తాలోని ఓ వైన్ షాప్ ముందు వ్యక్తి అనుమానాస్పద మృతి

    • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు

    • మృతుడు పూడూరు మండలం గొంగుపల్లికి చెందిన యాదయ్యగా గుర్తింపు

    • మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యాదయ్య సోదరుడు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 06, 2026 07:55 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారాయణ

    • శ్రీవారి సేవలో మాజీ మంత్రి నారాయణ స్వామి, ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ తదితరులు

  • Sep 06, 2026 07:45 IST

    తూర్పుగోదావరి: నిడదవోలులో లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

    • రైలును ప్రారంభించిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

  • Sep 06, 2026 07:30 IST

    నెల్లూరు: ఆత్మకూరు వద్ద మహిళపై కత్తితో దాడి ఘటనలో భర్తే నిందితుడు

    • భార్య మహాలక్ష్మిపై దాడి చేసింది భర్త హేమసాయేనని పోలీసుల విచారణలో వెల్లడి

    • కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య గొంతు, చేతులపై కత్తితో దాడి

    • వారం రోజుల క్రితమే ఏఎస్ పేట మండలం పందిపాడులో హేమసాయి–మహాలక్ష్మి వివాహం

  • Sep 06, 2026 07:25 IST

    పాకిస్థాన్‌పై నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్

    • 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్

    • 55 పరుగులకే పాక్ ఆలౌట్

    • జట్టు ప్రదర్శన పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ హర్షం

    పూర్తి కథనం..

  • Sep 06, 2026 07:16 IST

    హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇవీ

    • 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,54,800

    • 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,900

    • కిలో వెండి ధర రూ.2.5 లక్షలు

    పూర్తి కథనం..

  • Sep 06, 2026 07:05 IST

    నెల్లూరు: కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద బ్రేక్ ఇన్‌స్పెక్టర్ గోపీనాథ్‌ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

    • బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌ వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ACB అధికారులు

    • కారులో రూ.2.48లక్షల నగదు గుర్తింపు.. కారు, నగదు స్వాధీనం

    • వాహనలను నిలిపి భారీ మొత్తంతలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు

    • గోపీనాథ్‌ని విచారిస్తున్న ACB DSP రామకృష్ణుడు, అధికారులు

  • Sep 06, 2026 06:50 IST

    జోగులాంబ గద్వాల: ఎర్రవల్లి NHపై టెన్త్ బెటాలియన్ సమీపంలో రోడ్డు ప్రమాదం

    • లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి, ఇద్దరికి గాయాలు

    • గాయపడిన వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    • హైదరాబాద్ నుంచి గద్వాల్ వెళ్తుండగా జరిగిన ప్రమాదం

    • మృతులు హైదరాబాద్‌కు చెందిన మౌనిక, సాయి రామ్‌గా గుర్తింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 06, 2026 06:45 IST

    నిజామాబాద్‌: ఇంకా లభించని మూడేళ్ల బాలుడి ఆచూకీ

    • నిన్న మాతా శిశు ఆసుపత్రి నుంచి వేదాన్ష్‌ అదృశ్యం

    • బాలుడు వేదాన్ష్‌ కోసం గాలిస్తున్న 4 పోలీసు బృందాలు

    • ఓ మహిళ వెంట వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో గుర్తింపు

  • Sep 06, 2026 06:40 IST

    రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

    • ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం

  • Sep 06, 2026 06:35 IST

    కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం

    • మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

    • నరసమ్మకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Sep 06, 2026 06:30 IST

    హైదరాబాద్: రాంనగర్‌ చౌరస్తాలో విషాదం

    • గణేశ్ ఆగమన్ కార్యక్రమంలో తొక్కిసలాట

    • ఘటనలో యువకుడు బద్రీనాథ్(20) మృతి

    • రాంనగర్ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగమన్

  • Sep 06, 2026 06:27 IST

    షఫాలీ వర్మ ప్రపంచ రికార్డు

    • ఆసియా కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో షఫాలీ వర్మ అరుదైన ఘనత

    • మహిళల టీ20ల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకున్న స్టార్ ఓపెనర్

    • ఈ ఫీట్ అందుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు

    పూర్తి కథనం..

  • Sep 06, 2026 06:25 IST

    కాంగోలోని కిన్షాసాలో భారీ అగ్నిప్రమాదం

    • ఓ పెళ్లి వేడుకలో చెలరేగిన మంటలు, 22 మంది మృతి

  • Sep 06, 2026 06:20 IST

    కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల మండలి ఎన్నికలు

    • మధ్యాహ్నం 2గంటల వరకు TFPC ఎన్నికలు, తర్వాత కౌంటింగ్

    • ఇప్పటికే అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

    • మిగతా పోస్టులకు రెండు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ

  • Sep 06, 2026 06:10 IST

    నేడు అమలాపురంలో ఆక్వా రైతుల సమావేశం

    • ఫీడ్ ధరల పెంపు అంశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

  • Sep 06, 2026 06:05 IST

    ఏలూరులో మోటార్ సైకిల్స్ దొంగల ముఠా అరెస్ట్

    • అరెస్ట్ అయిన వారిలో ఒక మైనర్, ఏడుగురు వ్యక్తులు

    • నిందితుల వద్ద నుంచి రూ.20 లక్షలు విలువ చేసే 21 బైకుల స్వాధీనం

  • Sep 06, 2026 06:03 IST

    నేడు ఇందిరాపార్క్‌ దగ్గర కాంగ్రెస్‌ మహాధర్నా

    • MLA పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌

    • వెయ్యి రోజులుగా వేతనం తీసుకుంటూ కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై అభ్యంతరం

  • Sep 06, 2026 06:00 IST

    నేడు చిత్తూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

    • పాకాల మండలం అడుసుపల్లిలో ఆంజనేయులు కుటుంబానికి పరామర్శ

    • చిత్తూరులో వసంతకుమార్ కుటుంబానికి మంత్రి లోకేశ్ పరామర్శ