-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 2nd September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 02 , 2026 | 07:11 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 02, 2026 21:42 IST
సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో దారుణం
భార్య, కుమారుడు, అత్తపై కత్తితో సురేశ్ అనే వ్యక్తి దాడి
భార్య జ్యోతి మృతి.. అత్త, కుమారుడి పరిస్థితి విషమం
సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు
-
Sep 02, 2026 21:41 IST
గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో విద్యార్థిని ఆచూకీ కనుగొనలేకపోవడం సిగ్గుచేటు: హైకోర్టు
గుంటూరు జిల్లా పోలీసులు గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య
-
Sep 02, 2026 21:40 IST
CBI ఇచ్చిన నివేదిక తర్వాతే టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథంపై అక్రమాస్తుల కేసు: ACB
మొత్తం 4 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించాం: ACB
లోకనాథం నుంచి కీలక పత్రాలు స్వాధీనం: ACB
-
Sep 02, 2026 21:07 IST
గోదావరి జలాల విడుదల అనంతరం 'ఎక్స్'లో సీఎం చంద్రబాబు పోస్ట్
నిన్న మార్కాపురంలో బిరబిరా కృష్ణమ్మ, నేడు అనకాపల్లిలో గలగలా గోదారమ్మ: సీఎం చంద్రబాబు
రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జీవనదుల పరవళ్లు ఎనలేని సంతోషం, సంతృప్తిని కలిగించాయి: సీఎం చంద్రబాబు
-
Sep 02, 2026 20:39 IST
ఢిల్లీ: AICC చీఫ్ ఖర్గే నివాసంలో కీలక భేటీ
ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భేటీ
-
Sep 02, 2026 20:33 IST
హైదరాబాద్: తుక్కుగూడ నర్సు హత్య కేసును సుమోటో విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్
ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం
నిందితుడిపై తక్షణ కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశం
-
Sep 02, 2026 19:36 IST
ఢిల్లీ: ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి భేటీ
కొండా సురేఖ వివాదం, కేబినెట్ విస్తరణ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై రేవంత్, భట్టి చర్చ
-
Sep 02, 2026 19:21 IST
హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు
రూ.620 కోట్లతో నిర్మించిన కారిడార్ ప్రారంభానికి సిద్ధం
రేపు నల్గొండ 'ఎక్స్' రోడ్స్-ఒవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభం
రేపు కారిడార్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
3.23 కిలోమీటర్ల పొడవున కారిడార్ నిర్మాణం
-
Sep 02, 2026 19:18 IST
మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి చేయూత: మంత్రి అజారుద్దీన్
278 మంది మైనారిటీ వితంతు మహిళలకు రూ.50 వేల చొప్పున సాయం
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మహ్మద్ అజారుద్దీన్
-
Sep 02, 2026 19:12 IST
రంగారెడ్డి: షాద్‌నగర్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య
కమ్మదనం గురుకుల హాస్టల్‌లో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య
-
Sep 02, 2026 18:57 IST
విశాఖ ఎయిర్‌పోర్టు కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఎయిర్‌పోర్టులో వాణిజ్య విమానాల నిలిపివేతపై దాఖలైన పిల్ కొట్టివేత
ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
-
Sep 02, 2026 18:49 IST
పల్నాడు: నర్సరావుపేట టీడీపీ కేడర్‌తో మంత్రి లోకేశ్ సమావేశం
గొడ్డలి పార్టీ సొంతవారినే చంపేసి మనపై నెడుతోంది: మంత్రి లోకేశ్
గొడ్డలి పార్టీ పట్ల టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి: మంత్రి లోకేశ్
డీఎస్సీపై ఆరోపణలు చేసి పారిపోవడం కాదు.. వాస్తవాలు ఉంటే ధైర్యంగా చర్చకు రావాలి: మంత్రి లోకేశ్
చట్టాన్ని ఉల్లంఘించేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్
-
Sep 02, 2026 18:28 IST
పల్నాడు: నరసరావుపేటలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
JNTU(K) కాలేజ్ నూతన హాస్టల్ భవనాల ప్రారంభం
రూ.70 కోట్ల వ్యయంతో వసతి గృహాల నిర్మాణం
-
Sep 02, 2026 18:27 IST
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సక్సెస్: జగ్గారెడ్డి
గత పదేళ్ల BRS పాలనలో ఉద్యోగాలు భర్తీ లేదు: జగ్గారెడ్డి
కాంగ్రెస్ సర్కార్ 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పాలనలో పోలీసుల నిర్బంధాలు లేవు: జగ్గారెడ్డి
రాహుల్‌పై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదు: జగ్గారెడ్డి
-
Sep 02, 2026 18:27 IST
ప్రకాశం: టంగుటూరు మం. సూరారెడ్డిపాలెం వద్ద ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
-
Sep 02, 2026 18:11 IST
మెదక్: నర్సాపూర్‌లో 22A జాబితాను వ్యతిరేకిస్తూ BJP ధర్నా
పాల్గొన్న ఎంపీలు రఘునందన్, విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల
కేసీఆర్ ఇంట్లో దోచుకుంది నలుగురే కానీ రేవంత్ ఇంట్లో ఏడుగురు ఉన్నారు: ఎంపీ ఈటల
పేదల భూములు కొల్లగొడుతున్నారు: ఎంపీ ఈటల
-
Sep 02, 2026 18:00 IST
హైదరాబాద్: KPHB ఫేజ్-7లో 16 MIG ప్లాట్లకు హౌసింగ్ బోర్డు వేలం
KPHBలో రూ.2.70 లక్షల ధర పలికిన గజం భూమి
ప్లాట్ల వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం
-
Sep 02, 2026 17:50 IST
విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో కీలక పరిణామం
నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన కోర్టు
సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్స్ జంగం నాని, బాబూరావు, సాంబయ్య బెయిల్ పిటిషన్ల కొట్టివేత
-
Sep 02, 2026 17:39 IST
హైదరాబాద్: మాదాపూర్ లో విద్యుత్ షాక్‌తో వ్యక్తి దుర్మరణం
అంజయ్య నగర్ సిద్ధిక్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాదం
ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అనుమానం
ఎలాంటి వివరాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు
-
Sep 02, 2026 17:17 IST
సిద్దిపేట జిల్లా: కొమురవెల్లి వెల్కమ్ బోర్డ్ రాజీవ్ రహదారిపై ప్రమాదం
బైకును ఢీకొని, ఆపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన కారు
ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
-
Sep 02, 2026 17:04 IST
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్
రెండు స్థానాలు పడిపోయి 9వ స్థానంలో కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్
7వ స్థానంలో రిషభ్ పంత్
బౌలర్ల జాబితాలో 3వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా
-
Sep 02, 2026 16:53 IST
2014లో అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టిపెట్టాం: చంద్రబాబు
2019 నాటికి 72 శాతం పోలవరం పనులు పూర్తిచేశాం: చంద్రబాబు
ప్రతి సోమవారం అంటే పోలవరంలా మార్చాం: సీఎం చంద్రబాబు
2019లో గొడ్డలి పార్టీ వచ్చింది.. పోలవరానికి శాపమైంది: చంద్రబాబు
కూటమి వచ్చాక.. పోలవరానికి శాపవిముక్త కలిగింది: చంద్రబాబు
-
Sep 02, 2026 16:46 IST
ఉత్తరాంధ్రకు గోదారమ్మను తీసుకొచ్చాం: సీఎం చంద్రబాబు
నదులు, వాగులు, వంకలు దాటుకుని గోదారమ్మ వచ్చింది: సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మను తరలించి కరవు పీడిత మార్కాపురానికి నీళ్లిచ్చాం: సీఎం చంద్రబాబు
నల్లమల కొండలను చీల్చుకుని కృష్ణమ్మ వచ్చింది: చంద్రబాబు
-
Sep 02, 2026 16:38 IST
అయోధ్య ట్రస్ట్ CEOగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
39 ఏళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించిన జితేంద్ర మిశ్రా
అయోధ్య రామాలయ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం
5,585 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ
-
Sep 02, 2026 16:17 IST
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి కుమారుడు సందీప్‌నకు బెయిల్ మంజూరు
రాయదుర్గం దగ్గర రోడ్డుప్రమాదం కేసులో అరెస్టైన సందీప్
బెయిల్ మంజూరు చేసిన ఉప్పరపల్లి కోర్టు
సందీప్ కారు ఢీకొని బిహార్ వాసి నందూలాల్ మృతి
-
Sep 02, 2026 16:02 IST
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
రైతులతో రెగ్యులేటర్ బటన్ నొక్కించి గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు
4 జిల్లాలకు పోలవరం ఎడమ కాలువ నుంచి జలాలు
పాయకరావుపేట దగ్గర హారతితో గోదావరి జలాలకు స్వాగతం
-
Sep 02, 2026 15:49 IST
కొండా సురేఖ అంశంపై అధిష్టానానికి రిపోర్ట్
కొండా సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు TPCC నివేదిక
-
Sep 02, 2026 15:46 IST
కొండా సురేఖ అంశంలో రేవంత్ వైఖరి అర్థమవుతోంది: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి
బీసీలను రాజకీయంగా వాడుకోవడంలో రేవంత్ దిట్ట: ఏలేటి
-
Sep 02, 2026 15:39 IST
నేడు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
373 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
141 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
-
Sep 02, 2026 15:22 IST
మీడియాతో కొండా సురేఖ చిట్‌చాట్
మల్లికార్జున ఖర్గేను కలిశా: కొండా సురేఖ
కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదు: కొండా సురేఖ
అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నా: కొండా సురేఖ
రాజీనామా చేయాలని నన్ను కోరలేదు: కొండా సురేఖ
-
Sep 02, 2026 15:15 IST
నల్లగొండ: MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
నాయకుడు అంటే ఎలా ఉండాలనేదానికి స్ఫూర్తి YSR: రాజగోపాల్‌రెడ్డి
నల్లగొండ ప్రాంత కరవు, ఫ్లోరైడ్‌ను తరిమికొట్టడానికి ఉదయసముద్రం ప్రాజెక్టు తెచ్చిన ఘనత YSRదే: రాజగోపాల్‌రెడ్డి
రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం పనిచేస్తాం: MLA రాజగోపాల్‌రెడ్డి
-
Sep 02, 2026 15:08 IST
అమలాపురంలో విద్యుత్ షాక్‌తో జనసైనికుడి మృతిపై పవన్ కల్యాణ్ స్పందన
ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తూ విద్యుత్ షాక్‌తో ప్రేమ్‌కుమార్ మృతి కలిచివేసింది: పవన్
యువకుడి కుటుంబానికి అండగా నిలబడతాం: పవన్ కల్యాణ్
-
Sep 02, 2026 15:07 IST
వెయ్యి రోజుల పాలనపై అధిష్ఠానానికి వివరించాం: మహేశ్‌గౌడ్
వెయ్యి రోజుల పాలనపై అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసింది: మహేశ్‌గౌడ్
సమావేశంలో కొండా సురేఖ అంశం ప్రస్తావనకు వచ్చింది: మహేశ్‌గౌడ్
అధిష్ఠానానికి మేం చెప్పాల్సింది చెప్పాం: మహేశ్‌గౌడ్
తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకుంటుంది: మహేశ్‌గౌడ్
-
Sep 02, 2026 15:03 IST
పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాల్వ పరిశీలన
పాయకరావుపేట దగ్గర జలహారతి అనంతరం ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్న చంద్రబాబు
4 జిల్లాలకు పోలవరం ఎడమ కాలువ నుంచి జలాలు
-
Sep 02, 2026 14:58 IST
BRS, BJP ఒక్కటే: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఎంపీ ఎన్నికల్లో BRSకు గుండుసున్నా: మంత్రి పొంగులేటి
కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారు: పొంగులేటి
BJPతో ఓపెన్‌గా జతకడితే సంతోషిస్తాం: పొంగులేటి
కంటోన్‌మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మా గెలుపు చూసైనా BRS తీరు మారలేదు: పొంగులేటి
-
Sep 02, 2026 14:55 IST
నేపాల్ వరదల్లో 1,130కి పెరిగిన మృతులు
వరదల్లో 4,500 మందికిపైగా గల్లంతు
-
Sep 02, 2026 14:36 IST
రేపే బీసీసీఐ రివ్యూ మీటింగ్
గంభీర్, అగార్కర్ లక్ష్మణ్‌కు పిలుపు
యూకే పర్యటనలో టీమిండియా ఓటములపై చర్చ
-
Sep 02, 2026 14:34 IST
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్
మీలా యాస, ప్రాసతో ప్రజలను మభ్యపెట్టం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలన సూపర్‌హిట్: పొంగులేటి
ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సుపరిపాలన అందిస్తున్నాం: పొంగులేటి
BRS పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు: పొంగులేటి
-
Sep 02, 2026 14:26 IST
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతోపాటు పలువురు కేంద్రమంత్రులతోనూ రేవంత్ సమావేశాలు
-
Sep 02, 2026 14:15 IST
ఢిల్లీ: ఇందిరాభవన్‌లో కీలక సమావేశం
ఖర్గే, కేసీతో రేవంత్, మహేశ్‌గౌడ్, కొండా సురేఖ భేటీ
గంటకు పైగా కొనసాగిన సమావేశం
కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలపై చర్చ
సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన మీనాక్షి నటరాజన్
-
Sep 02, 2026 14:00 IST
నిజామాబాద్: ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నిరసన
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
కింది బజార్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకూ భారీ ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల బాకీ కార్డులను ఇంటింటికీ పంచుతూ ర్యాలీ
-
Sep 02, 2026 13:45 IST
ఖమ్మం జిల్లా వైరా బీఆర్‌ఎస్‌లో వర్గ పోరు
వైరాలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై తహశీల్దారు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నిరసన
వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సమక్షంలో ఇరువర్గాల తోపులాట, ఘర్షణ
-
Sep 02, 2026 13:32 IST
కాంగ్రెస్‌లో కొత్త టీపీసీసీ చీఫ్ అంశంపై చర్చ
ఈనెల 15తో ముగియనున్న మహేశ్ గౌడ్ పదవీకాలం
ఉమ్మడి నిజామాబాద్ కోటాలో మహేశ్ గౌడ్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం
మంత్రి పదవి ఇస్తే కొత్త పీసీసీని నియమించే ఛాన్స్
-
Sep 02, 2026 13:30 IST
కర్నూలు జిల్లా: ఆదోని–సిరుగుప్ప మార్గంలో లారీపై కూలిన భారీ వేప చెట్టు
చెట్టు పడటంతో లారీ ముందు క్యాబిన్ ధ్వంసం
లారీ డ్రైవర్‌కు తప్పిన పెను ప్రమాదం
చెట్టు కూలడంతో ఆదోని–సిరుగుప్ప రోడ్డుపై రాకపోకలకు అంతరాయం
-
Sep 02, 2026 13:30 IST
దిశా సాలియన్ మృతి కేసును CBIకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఆదేశం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దగ్గర మేనేజర్‌గా చేసిన దిశ
2020 జూన్ 8న దిశా శాలియన్ అనుమానాస్పద మృతి
-
Sep 02, 2026 13:28 IST
యూఎస్, చైనా, భారత్ పరిహారం చెల్లించాలి.. నేపాల్ డిమాండ్
ఇటీవలి వరదలకు పర్యావరణ మార్పులే కారణమన్న నేపాల్
ఇందుకు యూఎస్, చైనా, భారత్‌లదే బాధ్యత అని స్పష్టీకరణ
ఈ మూడు దేశాలే పరిహారం చెల్లించాలన్న నేపాల్ మంత్రి
-
Sep 02, 2026 13:15 IST
హనుమకొండ: పరకాలలో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు పర్యటన
అమరదామంలో అమరవీరులకు నివాళులర్పించిన రాంచందర్‌రావు
-
Sep 02, 2026 13:00 IST
ఢిల్లీ: ఖర్గేతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సురేఖపై చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరినట్టు సమాచారం
కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు నేతలతోనూ సమావేశమైన రేవంత్
-
Sep 02, 2026 12:45 IST
బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కీలక బాధ్యతలు
'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్ యాదవ్ నియామకం
మోదీ 25 ఏళ్ల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు 'సేవా సంకల్ప్ అభియాన్'
ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు కార్యక్రమాలు
-
Sep 02, 2026 12:45 IST
అమరావతి: గొల్లగుప్ప ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా
పోలవరం కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న పవన్
బాలిక మృతిపై విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
గ్రామస్తులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశం
పంపిణీ చేసిన మలేరియా టాబ్లెట్లను ల్యాబ్‌కు పంపాలని సూచన
-
Sep 02, 2026 12:35 IST
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: మంత్రి నారా లోకేశ్
ఉత్తరాంధ్రకు పరిశ్రమలను తీసుకొస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: మంత్రి నారా లోకేశ్
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి.. పోలవరం ఎడమ కాలువ అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నాం: లోకేశ్
-
Sep 02, 2026 12:30 IST
కాకినాడ: జనసేన పార్టీ యువజన విభాగం పేరు 'జైకొట్టు'
పిఠాపురంలో 'జైకొట్టు' లోగో ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్
యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా పవన్ ఆడియో మెసేజ్
-
Sep 02, 2026 12:17 IST
కృష్ణాజిల్లా: గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
మోటూరులో బీరువా లాకర్ పగులగొట్టి బంగారం చోరీ
మోటూరుకు చెందిన తాడిపర్తి అశోక్‌కుమార్ అరెస్ట్
రూ.4.20 లక్షల విలువైన 48 గ్రాముల బంగారం స్వాధీనం
-
Sep 02, 2026 12:15 IST
నీటి విషయంలో రాయలసీమకు న్యాయం జరుగుతోంది: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
కర్నూలు: ఏ రాష్ట్రం చేయని ప్రాజెక్టుల క్యాలెండర్ మేం విడుదల చేశాం: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
36 ప్రాజెక్టుల్లో 14 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయి: పట్టాభి
గొడ్డలి పార్టీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది: పట్టాభి
అన్నమయ్య ప్రాజెక్ట్ విపత్తు క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది: పట్టాభి
రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
-
Sep 02, 2026 12:10 IST
కృష్ణా: ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు, హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించిన నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యేలు
ఎన్టీఆర్ ట్రస్ట్, కొల్లిపర లక్ష్మి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
-
Sep 02, 2026 12:05 IST
ఢిల్లీ: కేసీ వేణుగోపాల్‌తో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి భేటీ
పాల్గొన్న మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చ
కాసేపట్లో వచ్చి భేటీ కావాలని సురేఖకు వేణుగోపాల్ పిలుపు
ఇప్పటికే AICCకి బయల్దేరిన మంత్రి కొండా సురేఖ
కాసేపట్లో ఖర్గేతో భేటీకానున్న రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, మీనాక్షినటరాజన్
-
Sep 02, 2026 12:00 IST
ఢిల్లీ: ఇందిరా భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి మరోసారి భేటీ
-
Sep 02, 2026 11:50 IST
ట్రంప్ టర్కీ పర్యటనపై నెట్‌ఫ్లిక్స్ చిత్రం
'ద డెకాయ్ ప్లేన్' పేరుతో వీడియో మూవీ
ఇరాన్ ముప్పు నేపథ్యంలో టర్కీలో ట్రంప్ విమానం మార్పు
జులైలో జరిగిన రహస్య ఘటనపై నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
రేపు విడుదల కానున్న 'ద డెకాయ్ ప్లేన్'
-
Sep 02, 2026 11:45 IST
మేడ్చల్ జిల్లాలో నకిలీ వైద్యుల గుట్టురట్టు
ఎలాంటి డిగ్రీలూ లేకుండా వైద్యం అందిస్తున్న ఐదుగురి అరెస్ట్
మేడ్చల్ పరిధిలో ఇద్దరు, జగద్గిరిగుట్ట, పేట్ బషీరాబాద్, సూరారం పరిధిలో ఒక్కొక్కరు చొప్పున అరెస్ట్
భారీగా నకిలీ వైద్య పరికరాలు, మందుల స్వాధీనం
-
Sep 02, 2026 11:35 IST
ఢిల్లీ: రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
డిసెంబర్ 7-9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణలో డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాలపై చర్చ
-
Sep 02, 2026 11:30 IST
ప.గో.: తాడేపల్లిగూడెంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు
చీఫ్ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెంటపాడు నుంచి ర్యాలీ
మాజీ సైనికోద్యోగులను సత్కరించిన చీఫ్‌విప్ బొలిశెట్టి శ్రీనివాస్
-
Sep 02, 2026 11:15 IST
ఆరు గ్యారెంటీల పేరుతో బాండ్ పేపర్లు పంచారు: మాజీ మంత్రి హరీశ్ రావు
వంద రోజుల్లో అమలు చేస్తామని.. వెయ్యి రోజులైనా చేయలేదు: మాజీ మంత్రి హరీశ్ రావు
రేవంత్ అధికారంలోకి వచ్చాక ఒక్కో వ్యవస్థ కుప్పకూలుతోంది
రేవంత్ పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయి: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Sep 02, 2026 11:14 IST
హైదరాబాద్: BRS ఛార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్
ఛార్జ్‌షీట్లు కాదు.. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రండి
BRS ఛార్జ్‌షీట్‌లో అబద్ధాలు మాత్రమే ఉన్నాయి: ABNతో మంత్రి అడ్లూరి
వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల లిస్టును..
కేటీఆర్, హరీష్‌రావుకు పంపుతున్నా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
BRS మేనిఫెస్టో.. మా మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా?: ABNతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్
-
Sep 02, 2026 11:10 IST
విమానయాన సంస్థలకు జెలెన్‌స్కీ హెచ్చరిక
రష్యా గగనతలాన్ని ఉపయోగించొద్దని వార్నింగ్
రష్యా ఆకాశంలో డ్రోన్ దాడులు చేస్తామని ప్రకటన
అప్రమత్తమైన ఏవియేషన్ వర్గాలు
-
Sep 02, 2026 10:55 IST
మార్కాపురం: బేస్తవారిపేట మండలం పూసలపాడులో పాముకాటుకు మహిళా రైతు మృతి
పొలంలో గడ్డి కోస్తుండగా వెంకటలక్ష్మిని కాటు వేసిన పాము
కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి
-
Sep 02, 2026 10:50 IST
కామారెడ్డి: భిక్కనూరు శివారులో రేషన్ బియ్యం పట్టివేత
రూ.9లక్షల విలువైన 310 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం
లారీ సీజ్, హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు గుర్తింపు
-
Sep 02, 2026 10:45 IST
ఢిల్లీ: కాసేపట్లో కేసీ వేణుగోపాల్‌తో మీనాక్షి, మహేశ్ గౌడ్ భేటీ
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై కేసీ వేణుగోపాల్‌తో చర్చిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కొండా సురేఖ అంశం చర్చకు వచ్చే అవకాశం: మహేశ్ గౌడ్
AICC చీఫ్ ఖర్గేను కూడా కలుస్తాం: మహేశ్ గౌడ్
-
Sep 02, 2026 10:30 IST
హైదరాబాద్‌లో TGSMS పేరుతో పోస్టర్ల కలకలం
కాంగ్రెస్ పాలనపై వ్యంగ్య చిత్రాలతో పోస్టర్లు
రేవంత్‌రెడ్డి Ai ఫొటోలతో వెలిసిన పోస్టర్లు
సచివాలయం, గాంధీభవన్, జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు
-
Sep 02, 2026 10:05 IST
చైనా మాస్టర్స్: లక్ష్యసేన్ ఓటమి
కెనడా ప్లేయర్ విక్టోర్ లాయ్‌పై 14-21, 7-21 తేడాతో ఓటమి
-
Sep 02, 2026 09:50 IST
భద్రాద్రి కొత్తగూడెం: గొల్లగుప్ప బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉంది: ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి
హాస్పిటల్‌కు వచ్చే సమయానికి 7 ఏళ్ల బాలిక జమున మృతి చెందింది
కార్డియాక్ సమస్యలు ఉన్న వారికి క్లోరో క్వీన్ టాబ్లెట్ వికటించే అవకాశం ఉంది
చిన్నారి జమున పోస్ట్‌మార్టం నివేదికలో మృతికి గల కారణాలు తెలుస్తాయి
కోలుకున్న వారిని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం: ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ రెడ్డి
-
Sep 02, 2026 09:45 IST
టోల్‌ప్లాజాల దగ్గర అక్రమాలపై ఈడీ నజర్
దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
అనధికారిక సాఫ్ట్‌వేర్ యాప్‌లను ఉపయోగించి రూ.కోట్ల ఆదాయం దారి మళ్లించినట్టు గుర్తింపు
ఫోరెన్సిక్ ఆడిట్‌లో బయటపడ్డ టోల్ స్కామ్
మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ
-
Sep 02, 2026 09:33 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో భారీ చోరీ
వ్యాపారవేత్త ఇంట్లో 10 తులాలకు పైగా బంగారు ఆభరణల చోరీ
పోలీసులకు వ్యాపారవేత్త నీల్‌కౌర్ ఫిర్యాదు.. కేసు నమోదు
మరో రెండు ఇళ్లల్లోనూ చోరీకి యత్నించిన దుండగుడు
యజమానులు మేల్కొనడంతో పరారైనట్టు సీసీ ఫుటేజీలో గుర్తింపు
-
Sep 02, 2026 09:30 IST
అమరావతి: గొల్లగుప్ప ఘటనపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష
కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి
ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం
చిన్నారి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి
-
Sep 02, 2026 09:25 IST
తిరుపతి: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ACB తనిఖీలు
పెదకాపు లేఔట్‌లో లోకనాథం ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు
తిరుమలలోని గెస్ట్‌హౌస్‌లోనూ ACB తనిఖీలు
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో ACB తనిఖీలు
-
Sep 02, 2026 09:20 IST
తిరుపతి: ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్‌ను విడుదల చేసిన కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
ఈ నెల 3 నుంచి 8 వరకూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం
మేలోనే ఫలితాలు వచ్చినా.. 3 నెలల తర్వాత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడంపై విద్యార్థుల అసహనం
-
Sep 02, 2026 09:15 IST
కామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా 20 రోజుల స్పెషల్ డ్రైవ్
రూ.23లక్షల విలువైన 139 సెల్‌ఫోన్ల రికవరీ
CEIR విధానంతో ప్రతినెలా 150కిపైగా సెల్‌ఫోన్ల రికవరీ
CEIR పోర్టల్ వచ్చినప్పటి నుంచి రూ.8.66కోట్ల విలువైన 5,414 ఫోన్ల రికవరీ
-
Sep 02, 2026 09:00 IST
నెల్లూరు: ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం
గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీని ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
ఇద్దరికీ తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 02, 2026 08:45 IST
అంబేద్కర్ కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవులో విషాదం
డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురై జన సైనికుడి మృతి
మృతుడు బెండమూర్లంకకు చెందిన రోళ్ళ ప్రేమ్ కుమార్ (22) గా గుర్తింపు
-
Sep 02, 2026 08:30 IST
తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు
ఉదయం ఫిలింనగర్ సన్నిధానంలో జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు
10గంటలకు జనసేన పార్టీ కార్యాలయంలో కేట్ కటింగ్
11గంటలకు జనసేన యువజన విభాగం ఏర్పాటు కార్యక్రమం
సిటీ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జనసైనికులు, పవన్ అభిమానులు
-
Sep 02, 2026 08:21 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్.. రాజకీయ రంగంలోనూ ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు
భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలి: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
-
Sep 02, 2026 08:20 IST
ఢిల్లీ: ఉదయం 11:15కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
డిసెంబర్ 7-9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణలో డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాలపై చర్చ
-
Sep 02, 2026 08:15 IST
నేడు ఢిల్లీలో తెలంగాణ వ్యవహారాలపై కాంగ్రెస్ కీలక భేటీ
కేసీ వేణుగోపాల్‌తో భేటీకానున్న మీనాక్షి, మహేశ్ గౌడ్
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చ
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చ జరిగే అవకాశం
-
Sep 02, 2026 08:00 IST
నేపాల్ వరదల్లో 1,050కి చేరిన మృతుల సంఖ్య
ఇంకా లభించని 4 వేల మందికిపైగా ఆచూకీ
గల్లంతైనవారిలో 583 మంది విదేశీయులు
ఇప్పటివరకూ 12వేల మందిని రక్షించిన భద్రతా దళాలు
-
Sep 02, 2026 07:55 IST
తిరుపతి: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఇత్తడి పాత్రల వితరణ
రూ.2.20 లక్షల విలువైన 26 ఇత్తడి పాత్రల వితరణ
ఇత్తడి పాత్రలను కానుకగా అందజేసిన అమెరికా NRI దంపతులు దామరపాటి చంద్రమౌళి, లత
-
Sep 02, 2026 07:50 IST
గుంటూరు: తెనాలిలో వ్యాపారి కిడ్నాప్, హత్య కలకలం
దీప్తి అనే మహిళతో కోటి లింగయ్య సహజీవనం
కోటి లింగయ్య కనిపించడం లేదని పోలీసులకు దీప్తి ఫిర్యాదు
ఆగస్టు 29న తెనాలి సమీపంలో కోటి లింగయ్య కిడ్నాప్
కిడ్నాప్ చేసి కొట్టడంతో కోటి లింగయ్య మృతి
పోలీసుల అదుపులో కోటి లింగయ్య బావమరిది రాజేష్
కోటిలింగయ్య మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు
-
Sep 02, 2026 07:46 IST
అమరావతి: డిప్యూటీ సీఎం పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య: మంత్రి లోకేశ్
పవనన్న ఆయురారోగ్య, ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి: ఎక్స్‌లో మంత్రి లోకేశ్
-
Sep 02, 2026 07:45 IST
సికింద్రాబాద్: కంటోన్మెంట్‌లో ఆయుధాల చోరీపై రక్షణశాఖలో పెను దుమారం
12 అత్యాధునిక ఆయుధాలు, 21 మ్యాగజైన్లు, 1,912 తూటాలు మాయం
ఆయుధాల మాయంతో రంగంలోకి మిలిటరీ ఇంటెలిజెన్స్
ఆర్మీ అంతర్గత విచారణతో పాటు బొల్లారం పోలీసుల దర్యాప్తు
గత నెల 30న అర్ధరాత్రి చోరీ జరిగినట్టు గుర్తింపు
తెల్లవారుజాము 3:48కి మిల్కాసింగ్ మైదానం దగ్గర అనుమానాస్పద కదలికలు
-
Sep 02, 2026 07:30 IST
రంగారెడ్డి: మైలారదేవుపల్లిలో దారుణ హత్య
రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు
ఘటన స్థలానికి చేరుకున్న మైలారదేవుపల్లి పోలీసులు
హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
-
Sep 02, 2026 07:15 IST
అమరావతి: టీటీడీ, దేవాదాయ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
5 వేల దేవాలయాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశం
వెయ్యి పురాతన దేవాలయాల పునరుద్ధరణకు ఆదేశించిన సీఎం
4,192 కొత్త ఆలయాల ప్రతిపాదనలు, 967 ఆలయాల నిర్మాణం పూర్తి
ఆలయాల నిర్మాణానికి స్థలాలను వెంటనే ఖరారు చేయాలని ఆదేశం
అర్చకుల ప్రత్యేక శిక్షణా కోర్సులు ప్రారంభించాలని సీఎం సూచన
-
Sep 02, 2026 07:03 IST
ఫీల్డింగ్ కోచ్ కోసం లింక్‌డిన్‌లో పాకిస్థాన్ ఓపెన్ హైరింగ్!
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటూ జాబ్ పోస్ట్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై సోషల్ మీడియాలో ట్రోల్స్
-
Sep 02, 2026 06:57 IST
హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు ఇవీ
24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి రూ.1,54,080
22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం రూ.1,41,240
కిలో వెండి ధర రూ.2,49,900
-
Sep 02, 2026 06:55 IST
అమరావతి: పోలవరం జిల్లా గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
క్లోరోక్విన్ వికటించి బాలిక మృతి ఘటనపై వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశం
71 మందికి మందులు పంపిణీ చేసినట్లు వివరించిన అధికారులు
-
Sep 02, 2026 06:53 IST
పోలవరం: గొల్లగుప్పలో పలువురికి అస్వస్థత
74 మందికి క్లోరోఫిన్ టాబ్లెట్స్ పంపిణీ
టాబ్లెట్ వికటించి విద్యార్థి జమున(7) మృతి
టాబ్లెట్స్ వికటించి మరో 40 మందికి అస్వస్థత
భద్రాచలం, లక్ష్మ్మీపురం PHCలో బాధితులకు చికిత్స
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 34 మందికి చికిత్స
వీరిలో 33 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడి
-
Sep 02, 2026 06:50 IST
కడప: నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న జగన్
-
Sep 02, 2026 06:45 IST
తిరుపతి: మంగళంపేట అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి
13 ఏనుగుల్లో ఓ ఏనుగు మృతిచెందినట్టు గుర్తింపు
-
Sep 02, 2026 06:40 IST
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ చార్జ్‌షీట్
ఉదయం 11 గంటలకు చార్జ్‌షీట్ విడుదల చేయనున్న కేటీఆర్
-
Sep 02, 2026 06:35 IST
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత
రూ.19 లక్షల విలువైన 1.9 కేజీల అల్ప్రాజోలం స్వాధీనం
ఐదుగురి అరెస్ట్, కారు, బైక్, రూ.40వేల సీజ్
ప్రధాన నిందితుడు మాజీ ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్‌పై 3 NDPS కేసులు
-
Sep 02, 2026 06:30 IST
నేడు రెండో రోజు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్
సాయంత్రం కేవీపీ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం
-
Sep 02, 2026 06:25 IST
కాకినాడ: జగదీష్‌రెడ్డి హత్య కేసు.. నేడు నిందితుడు సాదిక్ కస్టడీ పిటిషన్‌పై విచారణ
ఇప్పటికే సాదిక్‌కు కెమికల్స్ అమ్మిన ఇద్దరి అరెస్ట్
కేరళం నుంచి కెమికల్స్ తెచ్చినట్టు నిర్ధారణ
-
Sep 02, 2026 06:20 IST
నేటి నుంచి కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పోరుబాట
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ ఆందోళనలు
-
Sep 02, 2026 06:17 IST
నేడు పోలవరం జిల్లా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
పాయకరావుపేట దగ్గర హారతితో జలాలకు స్వాగతం
4 జిల్లాలకు పోలవరం ఎడమ కాలువ జలాలు
పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి రూ.4,192 కోట్ల వ్యయం
-
Sep 02, 2026 06:10 IST
ఇరాన్‌పై అమెరికా సైన్యం దాడులు
IRGC స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులు
జోర్డాన్‌లోని యూఎస్ స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు
ఇరాన్ దాడులకు ప్రతి దాడులు నిర్వహించినట్లు అమెరికా వెల్లడి
-
Sep 02, 2026 06:05 IST
రెండో రోజు ఢిల్లీలో జల్ జీవన్ మిషన్‌పై సమీక్ష
హాజరుకానున్న ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు
హర్ ఘర్ నల్ జల్ పురోగతిపై సమగ్ర చర్చ
బకాయిలు, కరువు పరిస్థితులపై కీలక సమీక్ష
-
Sep 02, 2026 06:00 IST
నేడు పల్నాడు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన
నరసరావుపేట మండలం కాకానిలో JNTU(K) ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ భవనాల ప్రారంభం
నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో భేటీ
కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరాలయ దర్శనం